విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ ప్రమోషన్లను మెల్లగా పీక్స్ కు తీసుకెళ్తున్నారు. రేపు జరగబోయే ట్రైలర్ లాంచ్ ని ఆర్టిసి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎంలో గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద కటవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒంటి మీద అండర్ వేర్ తో భుజాల వెనుక జాతీయ జెండాను పట్టుకుని సిక్స్ ప్యాక్ తో రౌడీ బాయ్ ఇచ్చిన స్టిల్ లేడీ అభిమానులకు మాత్రం యమా హాట్ గా ఉంది.
ఇదంతా ఓకే కానీ ఇలా ఎక్కువ శాతం పబ్లిసిటీలో విజయ్ దేవరకొండను తక్కువ దుస్తులతో చూపించడం ఏంటో అర్థం కావడం లేదు. క్యారెక్టర్ బాక్సరే కావొచ్చు. రింగ్ లోకి వెళ్ళినప్పుడు ఒంటి మీద అంగరక్షం తప్ప వేరే బట్టలు ఉండవు. అదీ సహజమే. అంత మాత్రాన అన్నిటికి ఇలా చూపించుకుంటూ పోవాలానే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ మధ్య వదిలిన ఓ పోస్టర్ లో పూల గుత్తిని అడ్డుగా పెట్టుకుని నగ్నంగా నిలుచుకోవడం మీద విమర్శలు వచ్చిన మాట తెలిసిందే. దాన్ని సమర్ధించుకున్నారు లెండి
లైగర్ మీద మాములు అంచనాలు లేవు. థియేటర్ల దగ్గర మాస్ జాతర తీసుకొస్తుందని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టు కంటెంట్ వైరల్ అవ్వాలంటే ఇలాంటి ప్రచారమే కరెక్టనే వాదనలు లేకపోలేదు. ముందు నుంచి ఇదే తరహా స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ టీమ్ కు ఇప్పుడు పూరి బృందం తోడవ్వడంతో దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్తున్నారు. రేపు భాగ్యనగరంతో పాటు ముంబైలోనూ ఈవెంట్ చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చి కవరేజ్ ఇవ్వమని మీడియాకు కబురంపడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on July 20, 2022 2:23 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…