మొన్నటి దాకా ఇండియాలో ప్రైమ్ తో పోటీ పడలేక ఇటు సబ్ స్క్రైబర్స్ ని అటు వ్యూస్ ని చాలా పోగొట్టుకున్న నెట్ ఫ్లిక్స్ కి ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త ఉత్సాహం మొదలయ్యింది. నాలుగు బాషల హక్కులు కొన్న జీ5ని పూర్తిగా వెనక్కు నెట్టేస్తూ కేవలం హిందీ వెర్షన్ తోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో దానికి వచ్చిన గుర్తింపు చూసి ఉబ్బితబ్బిబవుతోంది. దానికి తగ్గట్టే ఇటీవల వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్స్ దానికి వరంగా మారాయి. మేజర్ హిందీ తెలుగు రెండు వారాలకు పైగానే టాప్ 1లో ట్రెండ్ అవుతూ గ్లోబల్ రీచ్ పెంచుకుంది.
తాజాగా అంటే సుందరానికి మలయాళంలోనూ వ్యూస్ పరంగా రికార్డులు కొట్టేస్తోంది. విరాట పర్వం ఎంత డిజాస్టర్ అయినా స్మార్ట్ స్క్రీన్ మీద చూసినవాళ్లు కోట్లలో ఉన్నారు. ఓటిటిలోనే దీని కంటెంట్ బాగా రీచ్ అవుతుందన్న విశ్లేషకుల అంచనా నిజమయ్యింది. ఇక ఈ శుక్రవారం ఎఫ్3తో మరోసారి రేస్ లో దూసుకుపోవడం ఖాయమనే నమ్మకం నెట్ ఫ్లిక్స్ టీమ్ లో బలంగా కనిపిస్తోంది. ఇవన్నీ తెలుగు సినిమాలు ఇచ్చిన బూస్టే. కోలీవుడ్ మల్లువుడ్ నుంచి వీటి స్థాయిలో ఆదరణ దక్కించుకున్నవి ఏవీ లేకపోవడం గమనార్హం
ఇకపై ఈ దూకుడుని ఇదే స్థాయిలో కొనసాగించేందుకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసుకొంటోంది. మన తెలుగు సినిమాలు బంగారు బాతులా మారుతున్నాయి. మరోపక్క అమెజాన్ ప్రైమ్ కు వరస షాకులు తగులుతున్నాయి. ఎంత భీభత్సమైన పబ్లిసిటీ చేసినా సరే ఆచార్య, రాధే శ్యామ్ లకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కెజిఎఫ్ 2 అదరగొడుతుందనుకుంటే పే మోడల్ లో తీసుకొచ్చి చేతులారా దాన్ని చంపుకున్నంత పని చేశారు. ఇలాంటి స్పీడ్ ని నెట్ ఫ్లిక్స్ కనక కంటిన్యూ చేస్తే ఒక్క టాలీవుడ్ తోనే టాప్ లో నిలబడిపోవచ్చు.
This post was last modified on July 19, 2022 10:27 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…