సినిమా నిర్మాణం రోజు రోజుకూ జూదంలా, చాలా ప్రమాదకరంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజుల్లో ఏ సినిమా ఆడుతుందో.. ఏది ఆడదో తెలియట్లేదు. అసలే ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటే.. కొవిడ్ తర్వాత ఆ రేట్ మరింత పడిపోతోంది. థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటుకు బ్రేక్ పడడం.. ఓటీటీలకు అలవాటు పడడం, దీనికి తోడు టికెట్ల రేట్లు పెరగడం ప్రతికూలంగా మారి.. పెద్ద సినిమాలు సైతం థియేటర్లలో అనుకున్నంతగా ఆడని పరిస్థితి కనిపిస్తోంది.
ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడి నిర్మాతలందరూ పునరాలోచనలో పడక తప్పట్లేదు. నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయి, థియేట్రికల్ రెవెన్యూ తగ్గిపోతూ నిర్మాతలు ఎలా బతకాలి మరి. స్వయంగా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత.. ప్రొడక్షన్ విషయంలో ఆందోళన చెందుతుండడం, ఆల్రెడీ పచ్చ జెండా ఊపిన సినిమాలకు బ్రేక్ వేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
తన ప్రొడక్షన్ హౌస్‌ను మరింత విస్తరించే క్రమంలో దిల్ రాజు పది చిన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఇంతకుముందు. కానీ గత కొన్ని నెలల్లో రిలీజైన సినిమాల పలితాలు చూశాక.. ఆ పది చిత్రాలనూ ఆపేసినట్లు రాజు స్వయంగా ప్రకటించాడు. కరోనా, లాక్ డౌన్ తర్వాత సినిమాలు చూసే విధానంలో ప్రేక్షకుల ఆలోచన తీరు మారిందని.. అందుకే వారి ఆలోచనలకు తగ్గట్లు మారాల్సిన అవసరం ఉందని.. కాబట్టి మళ్లీ ఆ సినిమాల స్క్రిప్టుల మీద పని చేయమని వాటి బృందాలకు చెప్పానని రాజు వెల్లడించాడు. అలాగే ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో కూడా రెండు చిత్రాలను తాత్కాలికంగా ఆపామని.. వాటి స్క్రిప్టుల మీద మళ్లీ వర్క్ జరుగుతోందని రాజు తెలిపాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలు తప్ప చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఏదీ అనుకూలంగా లేదని రాజు అభిప్రాయపడ్డాడు. తన సినిమాలనే కాక.. వేరే నిర్మాతలు చేస్తున్న సినిమాల విషయంలో పునరాలోచన అవసరమని.. అందరూ కాస్త ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, మారుతున్న ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లుగా సినిమాలు చేయాలని రాజు సూచించాడు.
This post was last modified on July 19, 2022 10:25 pm
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…