దగ్గుబాటి అభిమానులు బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఆశపడుతున్న వెంకటేష్ రానాల కలయిక సినిమాలో సాధ్యపడలేదు కానీ ఇద్దరూ ఓ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిన ఈ కామెడీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కి రానా నాయుడు టైటిల్ ఫిక్స్ చేశారు. కృష్ణం వందే జగద్గురుంలో కేవలం ఒక పాటకే పరిమితమైన ఈ కాంబో ఫుల్ లెన్త్ లో అలరించబోయేది ఇందులోనే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. ఎఫ్3 సక్సెస్ జోష్ లో ఉన్న వెంకీ ఫాన్స్ దీని కోసం ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు.
ఇది ఎప్పుడు వస్తుందనే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం రానా నాయుడు సిరీస్ ని దీపావళికి స్ట్రీమింగ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. దీన్నేదో ఆషామాషీగా విడుదల చేయడం లేదు. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు, తారల ఇంటర్వ్యూలు, నగరాలను సందర్శించడాలు వగైరా చాలా ఉంటాయి . అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఈ రానా నాయుడుని బలమైన అస్త్రంగా వాడుకోవాలనే ప్లాన్ లో ఉంది నెట్ ఫ్లిక్స్. కొంచెం బాగుందన్న టాక్ వచ్చినా వ్యూస్ వెల్లువెత్తుతాయి.
కరణ్ అంశుమాన్ – సూపర్న్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించిన రానా నాయుడుని అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనోవన్ ఆధారంగా రీమేక్ చేశారు. ఇండియన్ నేటివిటీ తగ్గట్టు కొన్ని కీలక మార్పులు జరిగాయి. వెంకీ చైతులను వెంకీ మామలో చూశాక ఇప్పుడు రానా నాయుడులో రానా జత కాబోతున్నాడు. ఈ సిరీస్ కనక సూపర్ సక్సెస్ అయితే మరికొందరు స్టార్ హీరోలు ఈ రూట్ లో వచ్చేందుకు రెడీ అవుతారు. ఆల్రెడీ నాగచైతన్య దూతని ఫినిష్ చేశాడు. సరైన స్క్రిప్ట్ వస్తే నాగ్ రెడీనే. ఇక చిరు బాలయ్యలే బ్యాలన్స్ ఉంటారేమో
This post was last modified on July 19, 2022 10:11 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…