టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడు దిల్ రాజు. సినిమాల స్కేల్, లాంగివిటీ, సక్సెస్ రేట్.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఆయన్ని తెలుగులో నంబర్ వన్ ప్రొడ్యూసర్ అని కూడా చెప్పొచ్చు. ఐతే దీని వెనుక ఎంత కష్టముందో అందరికీ తెలుసు. ఐతే టాలీవుడ్లో జెండా ఎగరేస్తే సరిపోదని పాన్ ఇండియా స్థాయికి తన ప్రస్థానాన్ని విస్తరించాలని ఆయన కొన్నేళ్ల నుంచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో సినిమాల నిర్మాణం మొదలుపెట్టారు. అలాగే పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు.
ఐతే తెలుగులో బాగా ఆడిన సినిమాలను ఎంచుకుని హిందీలో పునర్నిర్మించి మంచి ఫలితాలు అందుకోవాలని ప్లాన్ చేసిన ఆయనకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేయగా.. అది తుస్సుమనిపించింది. తాజాగా ‘హిట్’ రీమేక్‌తో హిందీ ప్రేక్షకులను పలకరిస్తే అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లే కనిపిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రం రూ.5 కోట్ల వసూళ్లకు పరిమితం కావడం పెద్ద షాకే.
తెలుగులో తన కొత్త చిత్రం ‘థ్యాంక్ యు’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి రాజుకు తన బాలీవుడ్ డిజాస్టర్ల గురించి అడిగిన ప్రశ్నకు నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చేసిన సినిమా ‘జెర్సీ’ అని.. ఈ చిత్రం తమ అందరికీ జాక్ పాట్ అవుతుందని.. 30-40 కోట్ల లాభం తెచ్చి పెడుతుందని అంచనా వేశామని.. కొవిడ్‌కు ముందున్న వాతావరణంలో అయితే సినిమా తమ అంచనాలకు తగ్గట్లే పెర్ఫామ్ చేసేదని.. కానీ కరోనా తర్వాత క్లాస్ సినిమాలు థియేటర్లలో ఆడే పరిస్థితి లేదని.. మొత్తంగా అక్కడ థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయిందని.. పలుమార్లు వాయిదా పడి ఆలస్యంగా రిలీజైన‘జెర్సీ’కి లాభాలు అందుకోవడం సంగతటుంచితే 4-5 కోట్ల నష్టం భరించాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజు చెప్పాడు.
ఇక ‘హిట్’ రీమేక్ గురించి మాట్లాడుతూ.. కొవిడ్‌కు ముందు రాజ్ కుమార్ రావు సినిమాలకు తొలి వీకెండ్లో 15 కోట్ల దాకా వసూళ్లు వచ్చేవని.. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి అందులో మూడో వంతు మాత్రమే కలెక్షన్ వచ్చిందని.. అంతలా మార్కెట్ పరిస్థితులు మారిపోయాయని.. ఈ ఫలితం తాము ఊహించిందే అని రాజు చెప్పాడు.
This post was last modified on July 19, 2022 11:33 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…