మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్.. ఇటీవల ఉన్నట్లుండి వార్తల్లో వ్యక్తిగా మారింది. అందుక్కారణం.. ఆమె జీవితంలో పెళ్లి అనే కొత్త అధ్యాయం మొదలవబోతోందన్న సమాచారం బయటికి రావడమే. 46 ఏళ్ల వయసున్న సుస్మితా.. ఇప్పటిదాకా ఒంటరిగానే ఉంది. పెళ్లి ఆలోచన చేయలేదు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఆమె ఎవరితోనూ ఏడడుగులు వేయలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని ఒంటరిగానే జీవిస్తూ వచ్చింది.
కానీ ఈ వయసులో.. తనకంటే 12 ఏళ్లు పెద్దవాడైన లలిత్ మోడీతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందని, త్వరలో వీరి పెళ్లి జరగబోతోందని సమాచారం బయటికి రావడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. లలిత్ మోడీతో సుస్మితా సేన్‌కు ప్రేమేంటి.. వీళ్లిద్దరికీ పెళ్లేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుస్మిత అభిమానులకైతే ఈ విషయం మింగుడుపడలేదు.
లలిల్ మోడీ 60వ పడికి చేరువ అవుతున్నాడు. అతనేమీ అందగాడు కాదు. సుస్మిత కంటే పొట్టిగా ఉంటాడు. వ్యక్తిగత ఇమేజ్ సంగతి తెలిసిందే. బీసీసీఐలో ఆర్థిక అవకవవకలకు పాల్పడినందుకు ఈడీ కేసుల్లో చిక్కుకుని దేశం విడిచి పారిపోయాడు. లండన్‌లో సెటిలై అక్కడి నుంచి ఇండియాకు తిరిగి రాలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని సుస్మిత ప్రేమించడానికి డబ్బు తప్ప వేరే కారణం లేదని సోషల్ మీడియా జనాలు తీర్మానించేశారు. ఆమెను గోల్డ్ డిగ్గర్‌గా పేర్కొంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ సుస్మితను బాగానే హర్ట్ చేసినట్లున్నాయి. తన గురించి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మీడియాలో వచ్చిన వార్తల తాలూకు లింక్స్ షేర్ చేస్తూ ఆమె కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసింది.
తాను గోల్డ్ డిగ్గర్ కాదని, తనకు వజ్రాలంటే ఇష్టమని, అవి కొనుక్కునే స్థాయి కూడా తనకు ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ కామెంట్స్ చేసేస్తున్నారని, అందరూ నిర్దయగా మారుతున్నారని, అసలు తాను ఒక వ్యక్తిని ఎందుకు ఇష్టపడ్డానో కారణాలు ఎందుకు చెప్పాలని, దీనిపై ఇతరులు ఒక నిర్ణయానికి ఎలా వస్తారని ఆమె ప్రశ్నించింది. మొత్తానికి తన గురించి మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సుస్మితా బాగానే హర్టయినట్లు కనిపిస్తోంది.
This post was last modified on July 19, 2022 11:02 am
హీరోయిన్లు సినీ రంగంలోకి వచ్చాక వారి ప్రేమాయణం గురించి రూమర్లు వినిపించడం మామూలే. వాటి గురించి ఓపెన్ అయ్యేవాళ్లు తక్కువమంది.…
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…