‘లైగర్’ … ఏంటిది పూరి ?

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్న ప్రేక్షకులకు ఎదురైతే ఆలోచనలో పడే పరిస్థితి. అవును ఇంత వరకూ ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరిస్తున్నారనేది సాధారణ ప్రేక్షకుడికి తెలియని విషయం. మేకర్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని హైడ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా రిలీజైన అక్డి పక్డి సాంగ్ డిస్క్రిప్షణ్ లో మాత్రమే లిజో జార్జ్ , చేతన్ అంటూ వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి. టీం నుండి వస్తున్న ఏ ఒక్క ప్రెస్ నోట్ లోనూ మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు కనిపించడం లేదు. తాజాగా పిఆర్ టీం నుండి వచ్చిన ట్రైలర్ రిలీజ్ ప్రెస్ ఇన్ఫో లో కూడా టెక్నీషియన్స్ లిస్టులో మ్యూజిక్ డైరెక్టర్ అనే పదం లేదు.

నిజానికి పూరి సినిమా సాంగ్స్ కి మంచి బజ్ ఉంటుంది. చక్రి , మణిశర్మ ల నుండి బెస్ట్ సాంగ్స్ తీసుకున్నాడు పూరి. ఇక ఈయనలో స్టఫ్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మణిశర్మని ‘ఇస్మార్ట్ శంకర్’ తో మళ్ళీ ఫాంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా పూరికే దక్కుతుంది. ఇలాంటి పూరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పకుండా ఆ విషయం ప్రేక్షకుడికి తెలియకుండా పెద్ద తప్పే చేస్తున్నాడు. నిజానికి లైగర్ కి సంబంధించి పూరి బాలీవుడ్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నాడనే కామెంట్స్ ఉన్నాయి.

దీనికి కరణ్ జోహార్ మెయిన్ ప్రొడ్యుసర్ కావడంతో ఆయన డిసీషణ్ మీదే పూరి డిపెండవుతున్నాడని అంటున్నారు. మ్యూజిక్ విషయంలో కరణ్ జోహార్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. అందుకే పూరి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెట్టుకున్నాడు. అంతెందుకు షూటింగ్ కూడా మొత్తం ముంబై లోనే చేస్తున్నాడు పూరి. కంటెంట్ లో ఎక్కువ హిందీ వాసనే కనిపిస్తుంది. అకిడి పకిడి సాంగ్ బీట్, విజువల్స్ కూడా బాలీవుడ్ స్టైల్ లోనే ఉన్నాయి.తప్ప తెలుగు ప్రేక్షకులను మెపించలేదు. దీన్ని బట్టి చూస్తే పూరి బాలీవుడ్ ఆడియన్స్ కోసమే లైగర్ తీస్తున్నట్లు ఉంది.

మరి అక్డి పక్డి సాంగ్ కంపోజ్ చేసిన ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్సే సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారా ? లేదా ఇంకా ఎవరైనా వర్క్ చేస్తున్నారా అనేది మేకర్స్ చెప్పే వరకూ వెయిట్ చేయాల్సిందే.