ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ దానికి తాలూకు అప్ డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది శ్రద్ధ కపూర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట. సాహో జంట కాబట్టి నార్త్ ఆడియన్స్ కు దీని వల్ల రీచ్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ మేరకు ఆమెను ఒప్పించడం కూడా జరిగిపోయిందంటున్నారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఉంటారా లేదా అనే అనుమానాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసిందట.
దాని ప్రకారం ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో పృథ్విరాజ్ ఉండటం ఖాయమేనట. కాకపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్రాండ్ గా ఇస్తారు. కెజిఎఫ్ రాఖీ భాయ్ అలియాస్ యష్ కూడా ఓ ఎపిసోడ్ లో తళుక్కున కనిపిస్తాడట. అది కథ ప్రకారమా లేక మల్టీ వర్స్ కాన్సెప్ట్ ని విక్రమ్ లో లోకేష్ కనగరాజ్ ఉపయోగించినట్టు ప్రశాంత్ కూడా ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది సినిమా చూశాకే అర్థమవుతుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఓ పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారట. ఒళ్ళు జలదరించే రేంజ్ లో పిక్చరైజేషన్ ఉంటుందని టాక్.
మొత్తానికి సలార్ తో అభిమానులకు ఫీవర్ తెప్పించేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా సగం పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. విడుదల విషయంలో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. 2023 సంక్రాంతికి ఇది లేదా ఆది పురుష్ ఏదో ఒకటి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ సలార్ ఒక భాగమే ఉంటుందా లేక కెజిఎఫ్ లాగా టూ పార్ట్స్ చేస్తారా అనే దాని గురించి కూడా క్లారిటీ లేదు. మొత్తానికి స్పెషల్ సర్ప్రైజులు చాలానే ఇవ్వబోతున్నారు.
This post was last modified on July 19, 2022 9:02 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…