గజినీ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం మురుగదాస్ స్పైడర్ డైరెక్టర్ గానే బాగా గుర్తుండిపోయాడు. మహేష్ బాబు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని వేస్ట్ చేసుకుని ప్రిన్స్ అభిమానులకు పీడకల మిగిల్చిన దర్శకుడిగా సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోలింగ్ చూడొచ్చు. తుపాకీ, కత్తి లాంటివి మాకెందుకు ఇవ్వలేదనే ఫ్యాన్స్ కనిపిస్తూ ఉంటారు. గతంలో చిరంజీవితోనూ స్టాలిన్ లాంటి సూపర్ ఫ్లాప్ ఇచ్చిన మురుగదాస్ కొన్నేళ్లుగా తమ మేజిక్ టచ్ కోల్పోయి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
రజినీకాంత దర్బార్ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో అప్పటినుంచి మురుగదాస్ కు భారీ గ్యాప్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరోలు అతను చెప్పే కథల మీద ఆసక్తి చూపించడం లేదు. ఇక మనవాళ్ళ గురించి చెప్పేదేముంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మహా అయితే అపాయింట్మెంట్ ఇస్తారేమో కాదు ప్రాజెక్టు మాత్రం కాదు. ఈ నేపథ్యంలో మురుగదాస్ వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న జనం మదిలో మెదులుతోంది. దానికి సమాధానం అమీర్ ఖాన్ సహాయంతో బాలీవుడ్ లో అడుగుపెట్టడం ద్వారా ఇవ్వబోతున్నారట దాస్.
సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ ని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే ఇద్దరినీ కలిసి లైన్ చెబితే వాళ్ళకు నచ్చిందట. అయితే ఫైనల్ వెర్షన్ అయ్యాక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మధ్యవర్తిత్వం అంతా గజిని ఇచ్చిన అభిమానంతో అమీరే చేశాడు. సల్మాన్ షారుఖ్ లు కలిసి నటించి దశాబ్దాలవుతోంది. అప్పుడెప్పుడో 1995లో చేసిన కరణ్ అర్జున్ గురించే ఇప్పటికీ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత అంటే రికార్డే. నిజంగా దాస్ కనక ఈ కాంబోని ఒప్పించగలిగితే అంతకన్నా గొప్ప ఘనత ఏముంటుంది
This post was last modified on July 18, 2022 6:58 pm
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…