Movie News

రామ్.. అసలుకే మోసం వచ్చింది

తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఒకప్పుడు మంచి మంచి సినిమాలే తీశాడు. రన్, పందెంకోడి, ఆవారా, వేట్టై (తెలుగులో తడాఖాగా రీమేక్ అయింది). ఆయన కథలు మరీ కొత్తగా ఏమీ ఉండవు. కానీ కథనంతో మ్యాజిక్ చేసేవాడు. ప్లెజెంట్ నరేషన్, మంచి యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్లతో సినిమాలను జనరంజకంగా మార్చేవాడు.

ఐతే చాలామంది స్టార్ డైరెక్టర్ల లాగే ఆయన మ్యాజిక్ ఒక దశ వరకే పని చేసింది. ఆయన కూడా ఫామ్ కోల్పోయాడు. గత దశాబ్ద కాలంలో లింగుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ పదేళ్లోల ఆయన తీసిన రెండు సినిమాలు దారుణమైన ఫలితాలను అందుకున్నాయి.

సూర్యతో లింగుస్వామి తీసిన ‘సికిందర్’ పెద్ద డిజాస్టర్. సూర్య కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో అదొకటి. ఆ తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని ‘పందెంకోడి-2’ తీశాడు. ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోజూసిన టైపు అని చెప్పాలి. ‘పందెంకోడి’కి పూర్తి భిన్నమైన ఫలితాలందుకుంది.

ఈ దెబ్బతో లింగుస్వామితో సినిమా చేయడానికి ఏ తమిళ స్టార్ ముందుకు రాలేదు. ఓ మోస్తరు హీరోలు కూడా అతడికి ముఖం చాటేశారు. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లను బుట్టలో వేయడానికి ప్రయత్నించి ఫెయిలయ్యాడు. కానీ రామ్ మాత్రం అతడికి లొంగిపోయాడు. తెలుగులో తన ఇమేజ్‌ను సినిమా సినిమాకు పెంచుకుంటున్న హీరో రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’తో అతడి స్థాయి పెరిగింది. తెలుగులో ఇంకో మాస్ సినిమా పడితే ఇంకో లెవెల్‌కు వెళ్లే దశలో ఉన్నాడు.

అదృష్టం కొద్దీ బోయపాటి శ్రీను లాంటి పెద్ద డైరెక్టర్‌తో అతడికి కాంబినేషన్ కుదిరింది. వెంటనే ఈ సినిమా వస్తే అతడి కెరీర్‌కు ఉపయోగపడేది. కానీ మధ్యలో లింగుస్వామి దూరాడు. ‘ది వారియర్’తో తెలుగులో ఇంకా ఇమేజ్ పెంచుకోవడంతో పాటు తమిళంలోనూ మార్కెట్ తెచ్చేసుకుంటానని రామ్ ఆశపడి ఉండొచ్చు.

కెరీర్లో తొలిసారి పోలీస్ క్యారెక్టర్ చేయడం తనకు కలిసొస్తుందని అనుకున్నాడతను. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. రామ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటి కాబోతోంది ‘ది వారియర్’. రూ.45 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అందులో నాలుగోవంతు షేర్ కూడా రాబడితే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. తమిళంలో ఈ సినిమా ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదన్నది అక్కడి ట్రేడ్ వర్గాల మాట. కొత్తగా తమిళనాట మార్కెట్ తెచ్చుకోవడం మాట అటుంచితే.. తెలుగులో ఉన్న మార్కెట్‌కు దెబ్బ పడేలా ఉంది. మొత్తానికి తమిళ దర్శకుడిని నమ్మి రామ్ గట్టి దెబ్బే తిన్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on July 18, 2022 6:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

6 minutes ago

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా…

22 minutes ago

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…

27 minutes ago

నటి రేప్ కేసు – హీరోపై కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…

39 minutes ago

అర్ధరాత్రి షోలు…150 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

1 hour ago

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…

2 hours ago