Dil Raju
ఇటీవలే గిల్డ్ నిర్మాతలు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో కొన్ని విషయాలను చర్చించుకున్నారు. ఆ చర్చ కి సంబంధించి మీడియా కి కొన్ని లీకులు అందాయి. దీంతో త్వరలోనే నిర్మాతలు స్ట్రైక్ అంటూ వార్తలు బయటికొచ్చాయి. అసలు ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు ? అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా గిల్డ్ కీలక నిర్ణయాలపై నిర్మాత దిల్ రాజు ఆ సంగతులు బయటపెట్టారు.
మీటింగ్ లో ముఖ్యంగా మూడు విషయాలు ఎక్కువగా చర్చించామన్నారు. అందులో మొదటిది కంటెంట్ అంటూ ఆయన చెప్పారు. కోవిడ్ టైంలో ఖాళీగా ఉండి అందరూ ఏవేవో కథలు రెడీ చేసి హీరోలను ఒప్పించి లాక్ చేసుకున్నారని , కానీ ఇప్పుడు ఆ కథలు వర్కౌట్ అవుతాయా ? అని ఆలోచించుకోవాలని అదే ప్రధాన అంశంగా చర్చించామని దిల్ రాజు అన్నారు. నిజానికి కోవిడ్ టైంలో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని, ఆ టైంలో వరల్డ్ వైడ్ గా వచ్చిన కంటెంట్ ని ఇంట్లో చూసి ఎడ్యుకేట్ అయ్యారని సో ఇప్పుడు సాదా సీదా కంటెంట్ తో వాళ్ళని మెప్పించడం కష్టమని గ్రహించి తీయబోయే కథలపై దృష్టి పెట్టి అలాంటివి డ్రాప్ చేయాలని ఓ మాట అనుకున్నామంటూ చెప్పారు. అందులో భాగంగా నేను ఇది వరకు ఓకె చేసిన 10 కథలను పక్కన పెట్టానని, అలాగే షూటింగ్ వెళ్ళాల్సిన రెండు సినిమాలను డ్రాప్ చేసి మళ్లీ డిస్కషన్స్ పెడుతున్నాని తెలిపారు.
ఇక రెండో విషయం OTT రిలీజ్ … దీని మీద చాలా సేపు మాట్లాడుకున్నాం. ఎనిమిది , పది వారాల వరకూ ఓటీటీ కి సినిమా ఇవ్వకుండ డీల్ చేసుకోవాలని మాట్లాడుకున్నామని తెలిపారు. నిర్మాతకు ఓటీటీ కిక్ ఇవ్వదని , కేవలం పేపర్ మీద డబ్బు మాత్రమే తెస్తుందని అన్నారు. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆరోజంతా హడావుడిగా ఉంటుందని, నాన్ స్టాప్ గా కాల్స్ , మెసేజెస్ వస్తుంటాయి, రోజు రోజు వచ్చే నంబర్స్ తృప్తి ఇస్తాయని, ఓటీటీ రిలీజ్ అంటే ఇవన్నీ ఏం ఉండదని జస్ట్ కాఫీ తగుతూ రిజల్ట్ విని ఓ బాగుందా సరే అని లైట్ తీసుకుంటామని అన్నారు.
మూడో టాపిక్ గా టికెట్ ప్రయజ్ గురించి చర్చించామని , ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుడికి ఖర్చు బాగా పెరిగిందని ఒకప్పటి లా సినిమా కోసం వేలు పెట్టానికి ఇష్టపడటం లేదని రెండో వారంలో ఇంట్లో ఫ్రీ గా చూసే సినిమాలకు వేయి రూపాయిలు పెట్టేందుకు రావడం లేదని అన్నారు. తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన సినిమాల కలెక్షన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుందని, నిర్మాతలుగా టికెట్ రేటు తగ్గించి పెట్టాలని అనుకున్నామని తెలిపారు. అందుకే మొన్నీ మధ్య F3 తనే మొదటి అడుగు వేసి రేట్లు తగ్గించానని అన్నారు. ఇప్పుడు థాంక్యూ కూడా 100 రూపాయలకే చూపించాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. సింగిల్ స్క్రీన్స్ లో 100 ప్లస్ జీఎస్టీ, మల్టీ ప్లెక్స్ లో 150 ప్లస్ జీఎస్టీ రేటుతో సినిమా రిలీజ్ అని చెప్పారు.
ఇక మీటింగ్ లో మాట్లాడుకున్నవన్నీ జరిగేలా మార్పు తీసుకురాన్నట్లు దిల్ రాజు చెప్పారు. ఎందుకంటే ఇది ఇప్పుడు నిర్మాతల సమస్య కాదు సినిమా సమస్య అంటూ ఆయన అన్నారు. త్వరలోనే చర్చలో జరిగిన విషయాలను ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నామని దాని గురించి అతి త్వరలోనే డీటెయిల్స్ అఫీషియల్ గా చెప్తామని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
నిజానికి దిల్ రాజు చెప్పినట్లు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఒకసారి అనాల్సిస్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. దర్శకులు కూడా ఇకపై ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకొచ్చే కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అఖండ నుండి విక్రమ్ వరకూ ఎన్ని సినిమాలు ఆడాయి..? ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు..? అని ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ కలిసి సినిమా పరిశ్రమను అలాగే థియేటర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే చాలా థియేటర్స్ కనుమరుగై పోవడం , ఉన్న థియేటర్స్ కి జనాలు రాక థియేటర్ బిజినెస్ మీద నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ కోట్లల్లో నష్టపోవడం ఖాయం.
This post was last modified on July 18, 2022 12:40 pm
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…