టెక్నాలజీ ఎంత పెరిగినా సినిమా బడ్జెట్ వందల కోట్లకు చేరినా పైరసీ మూలాలు ఎక్కడ ఉన్నాయో ఎలా అరికట్టాలో తలలు పండిన ఇండస్ట్రీ పెద్దలు కానీ ప్రభుత్వాల తరఫున పోలీస్ బాసులు కానీ కనిపెట్టలేకపోయారు. అందుకే వీడియో క్యాసెట్ల నుంచి టొరెంట్ల దాకా దాని రూపం మారుతోందే తప్ప ఈ భూతం చనిపోలేదు సరికదా మరింతగా పెచ్చుమీరిపోయింది. సినిమాలే కాదు ఇప్పుడు వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు కూడా పైరసీ బారిన పడి మిలియన్ వ్యూస్ పోగొట్టుకుని అరణ్యరోదన చేస్తున్నా లాభం లేకపోతోంది.
సరిగ్గా ఈ కాన్సెప్ట్ తోనే సోనీ లివ్ లో తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. సాహో విలన్ అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన ఈ వెబ్ డ్రామాను వచ్చే నెల 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో పైరసీ ఎక్కడ మొదలవుతుంది, రిలీజ్ కానీ సినిమాలు సైతం వీళ్ళు ఎలా నెట్ లో పెట్టగలుగుతున్నారు లాంటి చాలా అంశాలు స్పృశించారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ప్రస్తావన కూడా ఇందులో ఉండటం గమనార్హం.అంతా బాగానే ఉంది కానీ దీనికి కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ని జోడించి థ్రిల్లర్ టచ్ ఇచ్చారు.
ఇదంతా ట్రైలర్ లో హింట్ ఇచ్చాక నిజమైన తమిళ రాకర్స్ కు తెలియకుండా ఉంటుందా. అసలు తమకు సంబందం లేని నేరాలను చేసినట్టు ఈ సిరీస్ లో చూపించారని ఇది చాలా తప్పని ఓ చిన్న వార్నింగ్ లాంటిది తమ వెబ్ సైట్ లోనే ఇచ్చారు. ఇదెలా ఉందంటే రెడ్ హ్యాండెడ్ గా హత్య చేస్తూ దొరికిన హంతకుడు తన హక్కులను కాపాడమని జడ్జ్ ని బెదిరించడమన్నంత కామెడీగా ఉందన్న మాట. సిరీస్ అయితే తీశారు కానీ అందులో ఏమైనా పరిష్కారం చూపించారో లేదో వేచి చూడాలి. ఇది పైరసీ కాకుండా ఆపగలరా అంటే అసాధ్యమే సమాధానం.
This post was last modified on July 17, 2022 7:25 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…