తమిళ దర్శకుల పట్ల తెలుగు స్టార్ల అభిమానం ఇప్పటిది కాదు. బాలచందర్, భారతీరాజా, కె.ఎస్.రవికుమార్.. ఇలా చాలామంది తమిళ స్టార్ డైరెక్టర్లతో మన హీరోలు సినిమాలు చేశారు. ఐతే తర్వాతి కాలంలో ఈ ఒరవడి కొంచెం తగ్గింది. గ్యాప్ వచ్చింది. కానీ గత కొన్నేళ్ల నుంచి మళ్లీ తమిళ దర్శకులతో తెలుగు స్టార్లు అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తున్నారు. కానీ ఆ సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు.. తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్‌తో చేసిన ‘స్పైడర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
ఆ తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. కోలీవుడ్ యువ దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ‘నోటా’ చేయగా.. అది కూడా తుస్సుమనిపించింది. ఇప్పుడు రామ్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొంటున్నాడు. ఫాంలో లేని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామిని నమ్మి ‘ది వారియర్’ సినిమా చేస్తే అది నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
వరుసగా తమిళ స్టార్ డైరెక్టర్లు.. తెలుగు స్టార్లకు షాకులిస్తుండడంతో ఇప్పుడందరి ఫోకస్ శంకర్ మీదికి మళ్లింది. ఒకప్పుడు తెలుగులో దాదాపుగా ప్రతి స్టార్ ఓ సినిమా చేయాలని ఆశపడ్డ దర్శకుడు శంకర్. కానీ ఆయన సూపర్ ఫాంలో ఉండగా.. తెలుగు స్టార్లెవ్వరితోనూ సినిమాలు చేయలేదు. చివరికి తన జోరు తగ్గాక రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నప్పటికీ.. శంకర్ గత సినిమాలను తలుచుకుంటేనే మెగా అభిమానులకు లోలోన కొంచెం భయం కలుగుతోంది.
శంకర్ చివరి మూడు చిత్రాలు ‘2.0’, ‘ఐ’, ‘నన్బన్’ నిరాశ పరిచాయి. ఆయన తన టచ్ కోల్పోయాడనే విమర్శలు వినిపించాయి. ‘ఇండియన్-2’ కూడా మధ్యలో ఆగిపోయిన సమయంలో శంకర్.. చరణ్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అతణ్ని నమ్మి అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నాడు. కానీ తన ఫాం దృష్ట్యా శంకర్ మునుపట్లా మెరుపులు మెరిపించగలడా.. తెలుగు స్టార్లకు షాక్‌లు ఇస్తున్న తమిళ దర్శకుల ట్రెండ్‌ను బ్రేక్ చేస్తాడా అన్నది చూడాలి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 17, 2022 2:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…