ఈ వారం విడుదలైన సినిమాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది ఒక్క సాయిపల్లవి గార్గికే. ముందు అంచనాలేమీ లేవు కానీ రిలీజయ్యాక క్రిటిక్స్ సైతం బాగుందని మెచ్చుకున్నారు. విరాటపర్వం కన్నా చాలా మెరుగ్గా ఉందని ప్రశంసలు అందుతున్నాయి. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ అందులో ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఒక షాకింగ్ ఇష్యూని దర్శకుడు డీల్ చేసిన విధానం సీరియస్ మూవీస్ ని ఇష్టపడేవాళ్ళకు కనెక్ట్ అవుతోంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ కౌంటర్ల దగ్గర టికెట్లు అంతగా తెగడం లేదు థియేటర్ల దగ్గర జనం లేరు.
అవును గార్గి రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం నీరసంగా ఉన్నాయి. హౌస్ ఫుల్స్ సంగతి దేవుడెరుగు కనీసం సగం హాళ్లు కూడా నిండటం లేదు. నగరాల్లో అంతో ఇంతో నయం కానీ బిసి సెంటర్స్ లో మాత్రం మరీ సింగిల్ డిజిట్ ఆడియన్స్ వస్తున్నారు. దీని వల్ల షోలు రద్దు చేయలేక, వచ్చినవాళ్ళను వెనక్కు పంపడం ఇష్టం లేక ఓనర్లు పడుతున్న బాధ వర్ణనాతీతం. వీటికి తోడు వర్షాల దెబ్బ మాములుగా లేదు. జనం టైం పాస్ కోసమో సరదా కోసమో బయటికి వచ్చి తుడుచుకుంటూ సినిమాలు చూసే ఆలోచనలో లేరు.
ఇవన్నీ ఒక ఎత్తయితే టికెట్ రేట్లు మరో ఎత్తు. కనీసం గార్గి లాంటి వాటికి బాగా తగ్గించి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా జరగలేదు. ఆ మధ్య హ్యాపీ బర్త్ డేకు మాత్రమే ఫుల్ గా డిస్కౌంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ మొదటికే తెచ్చారు. గార్గి లాంటి సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో ప్రత్యేక వెసులుబాటు ఇస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అలా చేయడం కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఇకపైనైనా ఈ కోణంలో ఆలోచిస్తే కలెక్షన్లు పెరుగుతాయి.
This post was last modified on July 16, 2022 9:38 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…