అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఎంత ఆకట్టుకున్నాడో.. దర్శకుడిగా అంతకుమించి మెప్పించాడు. అతను తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ తెలుగు ప్రేక్షకులకు ఒక స్వీట్ మెమొరీ. అచ్చమైన తెలుగు వినోదంతో, ఆహ్లాదకరమైన కథాకథనాలతో ఆ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్‌గా అనిపించే సినిమా అది.
దీని తర్వాత అవసరాల రూపొందించిన ‘జ్యో అచ్యుతానంద’ సైతం అంతే స్థాయిలో ఆకట్టుకుంది. అవసరాల నుంచి ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని ప్రేక్షకులు ఆశించారు. కానీ అతను తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్నాడు. దర్శకుడిగా అవసరాల రెండో సినిమా రిలీజై ఎనిమిదేళ్లు కావస్తుండం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది అవసరాల కావాలని తీసుకున్న గ్యాప్ కాదు. నటుడిగా బిజీగా ఉండడం, దర్శకుడిగా మూడో సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఇంత విరామం వచ్చింది.
తన తొలి రెండు చిత్రాల్లో హీరోగా నటించిన నాగశౌర్యతోనే అవసరాల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాను కొన్నేళ్ల ముందే అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో బాగా ఆలస్యం జరిగింది. మధ్యలో ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. సినిమా నుంచి అసలే అప్‌డేట్ లేదు. దీంతో దీని గురించి అంతా మరిచిపోయారు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి ఆశ్చర్యకర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుందట. చివరి షెడ్యూల్‌ను ఇంగ్లాండ్‌లో ముగించడం విశేషం. అక్కడి నుంచే ఆన్ లొకేషన్ పిక్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. మిగతా డైరెక్టర్లకు ఉన్నట్లు మాస్ ఫ్యాన్స్ లేకపోవచ్చేమో కానీ.. సైలెంటుగా అవసరాల సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వాళ్లందరికీ ఇది చాలా ఆనందాన్నిచ్చే న్యూసే. గత కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నాగశౌర్యకు తన ఫేవరెట్ డైరెక్టర్ మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on July 16, 2022 9:13 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…