భారీ అంచనాల మధ్య ఇవాళ అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ టీజర్ వచ్చేసింది. అక్కినేని ఫ్యాన్స్ ఇదో పండగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. యూనిట్ ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ చేసి లాంచ్ చేయగా వివిధ నగరాల్లో అభిమానుల సందడి జోరుగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై డ్రామాలో అఖిల్ నెవర్ బిఫోర్ అవతారంలో టెర్రిఫిక్ గా ఉన్నాడు. మాములుగా సీక్రెట్ ఏజెంట్లు చాలా హుందాగా ఉంటారు. ఇందులో అఖిల్ డాన్స్ చేస్తూ శత్రువులను గన్నుతో కాల్చడం వెరైటీగా ఉంది.
సరే దీనికి నాగ్ కి కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్ అక్కడికే వద్దాం. 1988లో నాగార్జున హీరోగా కె రాఘవేంద్ర డైరెక్షన్ లో ఆఖరి పోరాటం వచ్చింది. భారీ బడ్జెట్ తో సి అశ్వినీదత్ అప్పటిదాకా తన బ్యానర్ లోనే కాస్ట్లీ ఫిలింగా ఖర్చు పెట్టారు. ఇందులో హీరో పాత్ర ఏజెంట్ కాదు కానీ శ్రీదేవి క్యారెక్టర్ అదే తరహాలో ఉంటుంది. క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసి మెషీన్ గన్లు పట్టుకుని విలన్ గ్యాంగ్ ని మట్టుబెడతారు. లాస్ట్ షాట్ లో నాగ్ పెద్ద తుపాకీ తీసుకుని అమ్రిష్ పూరి హెలికాఫ్టర్ ని పేల్చడంతో కథ ముగుస్తుంది. కమర్షియల్ గా ఇది పెద్ద హిట్టు.
అప్పటిదాకా మాస్ లో బలమైన మార్కెట్ ఏర్పడని కింగ్ కు ఆఖరి పోరాటం చాలా హెల్ప్ అయ్యింది. మాస్ సెంటర్స్ యాభై రోజులు పైగా ఆడి ప్రధాన కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. కెజిఎఫ్ టైపులో నాగ్ మొదటిసారి గన్ను పట్టుకుంది ఈ సినిమాలోనే. కట్ చేస్తే ఇప్పుడు అఖిల్ వరసగా లవ్ స్టోరీస్ తర్వాత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. అప్పటి ఆఖరి పోరాటంలో నాగ్ బాడీ లాంగ్వేజ్ ని ఇప్పటి ఆయన వారసుడి స్టైల్ ని పోలుస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి అప్పుడు నాగార్జునకి హిట్టు దక్కినట్టు ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్ కి బ్రేక్ ఇస్తాడా.
This post was last modified on July 15, 2022 7:33 pm
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…