Movie News

ధనుష్ కష్టం బూడిదపాలు?

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ‘తుల్లువదో ఎలమై’ అనే ఒక చిన్న సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత తమిళ సినిమాలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు ధనుష్. ప్రస్తుతం తమిళంలో పెద్ద స్టార్లలో అతనొకడు. తమిళనాడు అవతల వేరే తమిళ స్టార్లు చాలామందికి లేని గుర్తింపు అతడికి ఉంది. అనువాద చిత్రాలతోనే తెలుగులోనూ తనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. రాన్‌జానా, షమితాబ్, ఆత్రంగిరే చిత్రాలతో హిందీలోనూ మంచి గుర్తింపే సంపాదించాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేయాలని అతను చూస్తున్నాడు.

ఆల్రెడీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’ అనే సినిమాతో అంత‌ర్జాతీయ ప్రేక్ష‌కుల‌నూ ప‌ల‌క‌రించాడు ధనుష్. కానీ ఆ సినిమా చాలా ఆలస్యం అయి.. చివరికి రిలీజ్ తర్వాత సరైన స్పందనా తెచ్చుకోలేదు. అయినా ధనుష్ నిరాశ చెందలేదు. అతడికి ఇంకో భారీ ఇంటర్నేషనల్ మూవీలో అవకాశం దక్కింది. అదే.. ‘ది గ్రే మ్యాన్’.

‘ఎవెంజర్స్’తో పాటు ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన సినిమా ఇది. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవన్స్లాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో ధ‌నుష్ కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించాడు. అంతర్జాతీయ స్థాయిలో ధనుష్ కెరీర్‌కు ఈ చిత్రం ఒక గొప్ప మలుపు అవుతుందని అంతా ఆశించారు. కానీ నెట్‌ప్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నిరాశే కలిగించేలా ఉందన్నది టాక్.

ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయనుండగా.. ముందే యుఎస్‌లో ప్రముఖులకు, మీడియాకు స్పెషల్ ప్రిమియర్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ధనుష్ తన ఇద్దరు కొడుకులతో వెళ్లి సందడి చేశాడు. కానీ ఈ ప్రిమియర్ల తర్వాత వచ్చిన రివ్యూలన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. ఊరికే ఆడంబరం తప్ప సినిమాలో విషయం లేదని అందరూ తేల్చిపడేస్తున్నారు. రివ్యూల్లో ధనుష్ గురించి ప్రస్తావన కూడా కరవైన పరిస్థితి. ట్రైలర్లో కూడా ధనుష్ కనిపించింది కొన్ని సెకన్లే. సినిమాలో అతడికి ప్రాధాన్యం కూడా తక్కువే అని తెలుస్తోంది. ఓవైపు నెగెటివ్ టాక్, మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యం అంతంతమాత్రమే కావడంతో ధనుష్‌కు తీవ్ర నిరాశ తప్పేలా లేదు.

This post was last modified on July 15, 2022 11:30 am

Share

Recent Posts

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

1 hour ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

2 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

2 hours ago

రవితేజకు జోడీ ఎవరు?

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…

2 hours ago

మస్క్‌కు BYD ప్రశ్న… సమాధానం ఏది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…

2 hours ago

టార్గెట్ @ 100 ప‌ర్సంట్‌: మంత్రుల‌కు బాబు బిగ్ టాస్క్‌

ఏపీ మంత్రుల‌కు సీఎం చంద్ర‌బాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఏపీ మంత్రివ‌ర్గం..…

2 hours ago