లలిత్ మోడీ గుర్తున్నాడా? అంత సులువుగా మరిచిపోయే పేరైతే కాదది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా లీగ్స్‌లో ఒకటిగా ఎదిగి ఏటా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం తెచ్చి పెడుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది ఇతనే. ఐపీఎల్ ఛైర్మన్‌గా కొన్నేళ్ల పాటు అతను భారత క్రికెట్లో చక్రం తిప్పడం అందరికీ తెలిసిందే. కానీ బీసీసీఐలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డమే కాక.. బయట కూడా కొన్ని ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని చాలా ఏళ్ల కిందటే దేశం విడిచి వెళ్లిపోయాడు లలిత్ మోడీ.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహాలోనే అతను కూడా లండన్లోనే సెటిలయ్యాడు. ఇండియాలో అతడి మీద కేసులున్నాయి. ఇక్కడికి వచ్చాడంటే అరెస్టయి జైలుకు వెళ్లక తప్పదు. ఈ స్థితిలో లండన్లోనే ఉండిపోయాడు. తిరిగి ఇండియాకు వచ్చే సూచనలే కనిపించడం లేదు. అతడి కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తితో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ప్రేమలో పడిందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
1994లో విశ్వ సుందరిగా నిలిచి.. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌గా చాలా ఏళ్లు అలరించిన సుస్మిత ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. వేర్వేరు సమయాల్లో ఆమెకు వేర్వేరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ.. ఎవ్వరితో ఏడడుగులు మాత్రం నడవలేదు. పెళ్లి చేసుకోకపోయినా ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారికి తల్లిగా వ్యవహరిస్తూ వచ్చిన సుస్మిత ఎట్టకేలకు పెళ్లి వైపు అడుగులేస్తోంది. ఆమె లండన్లో కొంత కాలంగా లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్న విషయం ఇప్పుడు వెల్లడైంది.
సుస్మితనే స్వయంగా తాను లలిత్‌ను పెళ్లాడబోతున్న విషయాన్ని వెల్లడించినట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. దీని గురించి లలిత్ మోడీ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తాను, సుస్మిత ప్రస్తుతం డేటింగ్ మాత్రమే చేస్తున్నామని.. త్వరలోనే పెళ్లి కూడా జరగొచ్చని అతను వ్యాఖ్యానించాడు. మరి లలిత్ మోడీకి ఉన్న ఇమేజ్, వివాదాల ప్రకారం చూస్తే.. సుస్మిత ఈ వయసులో అతణ్ని ప్రేమించడం చాలామందికి మింగుడు పడడం లేదు.
This post was last modified on July 15, 2022 9:18 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…