Movie News

దర్శకులకు కొరటాల పాఠం

ఇండస్ట్రీలో ఎవరైనా ఏ విభాగానికి చెందిన వారైనా నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించాలనుకోవడం సహజం. అందులో భాగంగా ఎందరో హీరో హీరోయిన్లు తమ వృత్తితో సంబంధం లేకుండా రెస్టారెంట్లు, పబ్బులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇది తప్పేం కాదు. అలాంటిది ఒక దర్శకుడు నిర్మాణంలో భాగస్వామి కావడం ద్వారానో లేదా డిస్ట్రిబ్యూషన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారానో లాభాలు చేసుకోవాలనుకోవడం నేరం కాదు. దర్శకుడు కొరటాల శివ ఆ ఉద్దేశంతోనే చేశారు.

కానీ ఆచార్య విషయంలో లెక్క తప్పారు. ఇప్పుడది పీకకు చుట్టుకుని నష్టాల పేరుతో నానా రచ్చ చేస్తూ అటు చిరంజీవికి ఇటు తనకు లేనిపోని చెడ్డపేరు తెచ్చి పెడుతోంది. అసలు గతంలో ఇంత స్థాయి డిజాస్టర్లే లేవా అంటే భేషుగ్గా బోలెడున్నాయి. ఓ యంగ్ స్టార్ హీరో డిజాస్టర్ దెబ్బకు నిర్మాత ఒకరు ఏకంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయారు. ఇంకో సీనియర్ తో మార్కెట్ కి మించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన బడా ప్రొడ్యూసర్ ఆఖరికి ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి తేవడానికి మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి అన్న ఎన్టీఆర్ కాలం నుంచి 2022 దాకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.

మరి ఆచార్యకి ఇంత రగడ ఎందుకంటే కొరటాల అన్నీ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ తో సహా అన్నీ తన చేతుల్లోకి తీసుకోవడమే. చిరంజీవి సినిమా అందులోనూ రామ్ చరణ్ కాంబినేషన్ ఇంకేం కనక వర్షం ఖాయమని గుడ్డిగా నమ్మేసి కనీసం స్క్రిప్ట్ ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోకుండా బరిలో దిగి ఇంత చేటు చేసుకున్నారు. ఎవరు ఎన్ని కోట్లు వెనక్కు ఇచ్చారు, ఎవరు ఏ ఆస్తి అమ్ముకున్నారు ఇవన్నీ నిర్ధారణగా చెప్పలేం కానీ సోషల్ మీడియాలో మాత్రం మాములు రగడ జరగడం లేదు. సానుకూలంగా వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు.

ముగిసిపోయిందనుకున్న అధ్యాయాన్ని తవ్వితీసి కొరటాల నలభై కోట్ల ప్లాట్ అమ్ముతున్నారని, సీడెడ్ తో పాటు ఇతర డిస్ట్రిబ్యూటర్ల సెటిల్ మెంట్ కోసం తన బ్యాక్ అప్ సొమ్మునంతా ధారపోస్తున్నారని ఏదేదో ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమో కాదో కానీ మధ్యలో చిరంజీవి చరణ్ ల మీద నెగటివ్ ప్రాపగాండా కూడా జరిగిపోతోంది. అసలు నిర్మాతైన నిరంజన్ రెడ్డి పేరు ఇప్పుడీ ఇష్యూ మొత్తంలో పెద్దగా కనిపించకపోవడం అసలు ట్విస్ట్. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదు.

ఈ రోజు కాకపోయినా మరికొద్ది రోజుల్లో కొరటాల లేదా చిరంజీవి ఎవరో ఒకరు దీనికి సంబంధించిన క్లారిటీ కనీసం ఒక ఇంటర్వ్యూ రూపంలో అయినా ఇస్తే బెటర్. లేదా ఇప్పుడు మాట్లాడుకున్నదంతా నిజమనుకుని యాంటీ ఫ్యాన్స్ పబ్లిసిటీ చేయడంతో పాటు స్వంత అభిమానులు కూడా నిజమనుకుని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాబోయే గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్ మీద ప్రభావం ఉంటుందని వేరే చెప్పాలా. మొత్తానికి కొరటాల ఉదంతం నుంచి డైరెక్టర్లు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది.

ఎంత సినిమాల మీద సంపాదిస్తున్నా అందులో పెట్టుబడి పెడుతున్నప్పుడు అన్ని రకాల రిస్కులకు తెగబడాలి. లేదా ఇలాంటి ముప్పులు మరింత తీవ్రంగా ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడీ వివాదం కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మీద కొరటాల పూర్తి ఫోకస్ పెట్టలేకపోతున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. ఫైనల్ వెర్షన్ తారక్ కి పూర్తి సంతృప్తినివ్వలేదనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతోంది. డ్యామేజ్ మరింత ముదరకముందే వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టే ప్రయత్నాలు జరగాలి.

This post was last modified on July 14, 2022 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

6 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

6 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

7 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

7 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

7 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

9 hours ago