Movie News

చిరును నిందిస్తే ఎలా?

ఆచార్య సినిమా రిలీజై రెండున్న‌ర నెల‌ల కావ‌స్తోంది. కానీ ఆ సినిమా తాలూకు చేదు అనుభ‌వాలు ఇంకా దాని టీంను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వ్యాపార వ్య‌వ‌హారాల్లోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన పాపానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల మెడ‌కు న‌ష్ట ప‌రిహారం వ్య‌వ‌హారం చుట్టుకుని అల్లాడిపోతున్నాడు. ఈపాటికే ఎన్టీఆర్ సినిమాను మొద‌లు పెట్టాల్సిన ఆయ‌న.. ఆ ప‌ని చేయలేక‌పోతున్నాడు.

ఆచార్య డిజాస్ట‌ర్ కావ‌డం ఆయ‌న మీద ఒత్తిడి పెంచ‌గా.. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సెటిల్మెంట్ చేసే విష‌యం ఎడ‌తెగ‌ని విధంగా సాగుతూ.. త‌న కొత్త సినిమా మీద కొర‌టాల దృష్టిసారించ‌లేని ప‌రిస్థితి త‌లెత్తింది. కొన్ని ఏరియాల వ‌ర‌కు సెటిల్మెంట్ పూర్త‌యినా.. సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్లకు ప‌రిహారం విష‌యంలో ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో వాళ్లు కొరటాల ఆఫీస్ వ‌ర‌కు వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. కొంత‌మేర సెటిల్ చేసి, మిగ‌తాది ఎన్టీఆర్ సినిమా రిలీజ‌య్యాక చూద్దామ‌ని కొర‌టాల స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా వారు విన‌ట్లేదని.. తాము ఎంత న‌ష్ట‌పోయామో అంతా చెల్లింపులు చేయాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఐతే డిస్ట్రిబ్యూట‌ర్లు భారీగా న‌ష్ట‌పోతే కొంత మేర సెటిల్ చేయ‌డం వ‌ర‌కు ఓకే కానీ.. మొత్తం న‌ష్టాన్ని భ‌రించాలంటే ఎలా అన్న‌ది కొర‌టాల క్యాంప్ నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. డిస్ట్రిబ్యూట‌ర్లు భారీగా లాభాలు అందుకుంటే వాటిలోంచి వాటి ఇస్తారా అని కొరటాల మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. ఐతే ఈ వ్య‌వ‌హారంలో చిరు చేతులెత్తేస్తున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌లే దారుణం. ఈ క్ర‌మంలోనే #justiceforkoratalashiva అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవుతోంది. చిరును ట్రోల్ చేయ‌డానికే ఈ హ్యాష్ ట్యాగ్ అన్న‌ది స్ప‌ష్టం. దాని మీద అన్నీ కించ‌ప‌రిచే పోస్టులే ఉన్నాయి. విప‌రీత‌మైన ట్రోలింగ్ న‌డుస్తోంది.

కానీ ఆచార్య న‌ష్టాల భ‌ర్తీ కోసం చిరు, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ త‌మ‌కు పారితోష‌కం కింద రావాల్సిన డ‌బ్బుల‌న్నీ వ‌దులుకున్న‌ మాట వాస్త‌వం. సినిమాకు సంబంధించి ఎవ్వ‌రూ ముందు రెమ్యూన‌రేష‌న్లు తీసుకోలేదు. రిలీజ్ త‌ర్వాత చూసుకుందాం అనుకున్నారు. కానీ త‌ర్వాత ఒక్క రూపాయి కూడా తీసుకునే అవ‌కాశం ద‌క్క‌లేదు. మ‌రోవైపు కొర‌టాల కూడా పారితోష‌కం వ‌దులుకుని, సొంతంగా డ‌బ్బులు పెట్టి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సెటిల్ చేస్తున్నాడు. మ‌రి ద‌ర్శ‌కుడు, హీరోలు ఇంత త్యాగం చేసిన‌పుడు.. ఈ సినిమాతో డ‌బ్బులు చేసుకున్న నిర్మాత సంగ‌తేంట‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం.

This post was last modified on July 14, 2022 9:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

11 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

12 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

13 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

14 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

16 hours ago