‘ఆచార్య’తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాక్ తిన్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని కొందరు తక్కువ అంచనా వేస్తుండొచ్చుకానీ.. ఒకప్పుడు ఆయన అలాంటిలాంటి హిట్లు ఇవ్వలేదు. ప్రేక్షకుల మీద మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. ముఖ్యంగా 80, 90, 2000 దశకాల్లో చిరు ప్రభావం మామూలుగా ఉండేది కాదు. అప్పటి యువతకు ఆయన ఆరాధ్యుడు. అలాంటి అభిమానుల్లో సెలబ్రెటీలు కూడా ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్లో ఫేమస్ అయిన డీబీ రవితేజ సైతం చిరంజీవికి పెద్ద అభిమానేనట. అతను ఒకప్పుడు అండర్-16 దశలో విరాట్ కోహ్లితో కలిసి రూం షేర్ చేసుకున్నాడట. ఆ టైంలో అతను ఎప్పుడూ టీవీలో మెగాస్టార్ చిరంజీవి పాటలే చూస్తూ ఉండేవాడట. అప్పుడు కోహ్లి సైతం తనతో కలిసి చిరు పాటలకు స్టెప్పులేసేవాడట. చిరు మీద రవితేజ అభిమానం చూసి.. అతణ్ని ‘చిరు’ అనే పిలిచేవాడట. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే ఇప్పుడు వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం డీబీ రవితేజ యూకేలో ఉన్నాడు. బహుశా అక్కడ స్థానిక క్రికెట్ లీగ్స్ ఏమైనా ఆడుతున్నాడేమో తెలియదు. అతను తాజాగా విరాట్ కోహ్లిని కలిశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి తనను హాయ్ చిరు ఎలా ఉన్నావ్ అనే పలకరించినట్లు అతను వెల్లడించాడు.
ఈ క్రమంలోనే అండర్-16 రోజులను గుర్తు చేసుకున్నాడు. తాను, కోహ్లి కలిసి చిరు పాటలకు స్టెప్పుడేయడం, చిరు మీద తన అభిమానం చూసి విరాట్ తనను ఆ పేరే పెట్టి.. ఇప్పుడు అలాగే పలకరించడం గురించి వెల్లడించాడు రవితేజ. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు రేంజ్ అది అని, విరాట్ లాంటి ఫేమస్ క్రికెటర్ కూడా తన పాటలకు స్టెప్పులేశాడని.. అదే పేరుతో తన సహచర క్రికెటర్‌ను పిలిచాడని.. ఇలా తెలుగు రాష్ట్రాల అవతల కూడా సెలబ్రెటీల్లో ఫేమస్ అయిన అరుదైన హీరో ఆయన అని మెగా అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on July 13, 2022 6:59 pm
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…