చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళే పబ్లిసిటీ కీలకం. ఒకప్పటి లా పేపర్ ప్రకటన , టివీ లో యాడ్స్ ఇచ్చి నిర్మాతలు చేతులు దులుపుకుంటే అస్సలు కుదరదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ సినిమా న్యూస్, వీడియోస్ కనిపిస్తూ జనాలని ఎట్రాక్ట్ చేయగలిగితేనే బుకింగ్స్ ఫుల్ అయ్యే రోజులు వచ్చేశాయి. ఏదో మమ అనిపించుకునే ప్రమోషన్స్ చేస్తే ఆయా హీరో అభిమానులు కూడా రివర్స్ అవ్వడం ఖాయం.
తాజాగా అక్కినేని ఫ్యాన్స్ బడా నిర్మాత దిల్ రాజుని థాంక్యూ ప్రమోషన్స్ ఎక్కడా ? అంటూ వేదికపై నిలదీస్తూ ప్రశ్నించారు. దానికి దిల్ రాజు స్పందిస్తూ ఇంకేం చేయాలి మీరే చెప్పండి అంటూ తమ ప్రమోషన్ ప్లాన్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కినేని ఫ్యాన్ సైలెంట్ అయిపోయి మైక్ ఇచ్చేశాడు. అయితే ఈ ప్రశ్నకి ఆద్యం పోసింది రైటర్ బివీఎస్ రవి. ‘థాంక్యూ’ సినిమాకు కథ -మాటలు అందించిన రవి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు గారు ప్రమోషన్స్ చెయ్యట్లేదు. ఎక్కడైనా ఈ సినిమా ప్రమోషన్స్ కనిపిస్తున్నాయా ? అంటూ అక్కినేని ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. దీంతో అభిమాని తన చేతికి మైక్ రాగానే దిల్ రాజు ని నేరుగా అదే ప్రశ్న అడిగి ప్రమోషన్స్ గట్టిగా చేయమని కోరాడు.
నిజానికి దిల్ రాజు కి కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. జోష్ తర్వాత చైతు కి ఓ హిట్ బాకీ ఉన్నాడు. అందుకే జనాలను థియేటర్స్ కి రప్పించి ఈ సినిమాతో అక్కినేని హీరోకి ఓ సాలిడ్ హిట్ అవ్వాలని భావిస్తున్నాడు. మరి ట్రైలర్ తో మొదలైన థాంక్యూ ప్రమోషన్స్ ని దిల్ రాజు ఏ రేంజ్ కి తీసుకెళ్ళి అంత బజ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on July 13, 2022 6:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…