లెజెండ్ శరవణన్ అని తమిళనాట ఫేమస్ పర్సనాలిటీ. తమిళ నాట అతి పెద్ద షాపింగ్ మాల్ ఛైన్స్‌లో ఒకటైన శరవణ స్టోర్స్ అధినేతే ఈ లెజెండ్ శరవణన్. తన పేరు వెనుక ‘లెజెండ్’ అని తగిలించుకోవడమే కాదు.. తన మాల్ ప్రమోషన్లకు ఏ స్టార్‌ను ఉపయోగించుకోకుండా తనే మోడల్‌గా మారి ప్రకటనలు చేస్తుంటాడీ శరవణన్. అతడి లుక్స్ చూస్తే కమెడియన్ లాగా కనిపిస్తాడు. అయినా కాన్ఫిడెంట్‌గా స్టార్ హీరోయిన్లతో యాడ్స్‌లో హడావుడి చేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. ఈయన గారు ఇప్పుడు ఏకంగా హీరో అవతారం ఎత్తేశాడు.
‘లెజెండ్’ అనే టైటిలే పెట్టుకుని పెద్ద మాస్ హీరో స్టయిల్లో ఈ సినిమాలో హడావుడి చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక లో వేడుకలో తమన్నా, హన్సిక, శ్రద్ధా శ్రీనాథ్ సహా బోలెడంత మంది స్టార్ హీరోయిన్లు పాల్గొన్నారు. సినిమాతో ఏమాత్రం సంబంధం లేని వీళ్లంతా కేవలం భారీ పారితోషకాల కోసమని ఈ వేడుకకు వచ్చారు.
‘లెజెండ్’ మూవీ ఈ నెల 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ ప్రేక్షకులు ఈ అతిని ఎలా భరిస్తారో.. ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా చూసే బంపరాఫర్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా కల్పించడం విశేషం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేశారు. శరవణన్‌తో ఎన్వీ ప్రసాద్ అగ్రిమెంట్ చేసుకుని పేపర్లు మార్చుకుంటున్న వీడియో అది. ఏదో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా హక్కులు కొన్నట్లుగా ఎన్వీ ప్రసాద్ మహదానందంతో కనిపించారు ఈ వీడియోలో.
ఓ వైపు మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ లాంటి పెద్ద సినిమాను నిర్మిస్తూ ఎన్వీ ప్రసాద్ ఇలాంటి సినిమాను సమర్పించడం ఏంటో? హ్యారిస్ జైరాజ్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. ఇంకా చాలామంది పెద్ద పెద్ద టెక్నీషియన్లే ఈ సినిమాకు పని చేశారు. మరి ఈ సినిమా తెలుగులో ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.
This post was last modified on July 13, 2022 6:49 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…