మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా ‘ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ముందుగా సినిమాను మే 27న రిలీజ్ చేయాలనుకున్నారు ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. అంతలోనే మళ్ళీ వాయిదా వేసుకొని జులై 1న ఫిక్స్ చేసుకున్నారు. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఇక జులై ఎండింగ్ లేదా ఆగస్ట్ లో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ మేకర్స్ ఏకంగా సెప్టెంబర్ 2 న రిలీజ్ అంటూ ఓ న్యూ రిలీజ్ పోస్టర్ వదిలారు.
ఇలా నెలల తరబడి పోస్ట్ పోస్ట్ చేయడానికి రీజన్ రీ షూట్స్ అని తెలుస్తుంది. అవును దర్శకుడు గిరీశయా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా దగ్గర అర్జున్ రెడ్డి కి అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఈ డైరెక్టర్ తర్వాత తమిళ్ లో విక్రమ్ తనయుడు హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ని రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. తాజాగా సందీప్ రెడ్డి మిగతా వ్యక్తులు అవుట్ పుట్ చూసి కొన్ని చేంజెస్ చెప్పారని , అందుకే దర్శకుడు గిరీశాయ కాస్త టైం తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే వచ్చిన టీజర్ మంచి మార్కులు అందుకుని బజ్ క్రియేట్ చేసింది. బహుశా సినిమా పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ ఇంకా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారేమో. ఏదేమైనా ఈ సినిమా ఇంకోసారి కనుక వాయిదా పడితే వచ్చిన బజ్ అంతా హుష్ కాకీ అయినట్టే. మేకర్స్ ఆలోచించుకొని ఇక అదే డేట్ కి స్టిక్ అయితే బెటర్.
This post was last modified on July 13, 2022 6:36 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…