Movie News

‘థ్యాంక్‌ యు’ ఎందుకు చూడాలి.. దిల్ రాజు ప్రశ్న

కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారిపోతోంది. భారీతనం, యాక్షన్, క్రేజీ కామెడీ.. ఇలా ఏదో ఒక అంశం వారిని బాగా ఆకర్షిస్తే తప్ప ప్రేక్షకులు వెండితెరల వైపు కదలట్లేదు. రాజమౌళి అన్నట్లు ఏ జానర్లో సినిమా చేసినా అది ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఒక ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అక్కినేని నాగచైతన్య.

అతను ప్రధాన పాత్రలో ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన సినిమా ‘థ్యాంక్ యు’. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జులై 22న థియేటర్లలోకి దిగబోతోంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపిస్తూ.. తాను కోరుకున్న విజయాన్నందుకున్నాక, ఆ విజయానికి కారణమైన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారి కోసం తపించే కథతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కాగా ‘థ్యాంక్ యు’ థియేట్రికల్ లాంచ్ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే ప్రశ్నను తనే వేసి, దానికి సమాధానం చెప్పడం విశేషం. ‘‘అసలు థ్యాంక్ యు సినిమా ఎందుకు చూడాలి. చైతూ అభిమానులేమో తన కోసం చూస్తారు. మరి మిగతా వాళ్ల సంగతేంటి? ఈ ఏడాది వేసవిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారు. అందులో ఇద్దరు స్టార్ హీరోలు బ్రహ్మాండమైన యాక్షన్‌ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ‘కేజీఎఫ్-2’ కూడా విజువల్‌గా అద్భుతంగా చూపించారు. దాన్ని కూడా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అంతకుముందు పుష్ప కూడా అద్భుతంగా అనిపించింది. సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాను కూడా ప్రేక్షకులు చూశారు. ఇవన్నీ పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు.

మరి థ్యాంక్ యు సినిమా ఎందుకు చూడాలి అంటే.. ఇందులో ఉన్న ఫీల్ కోసం. కొన్ని సినిమాలు చూసి వచ్చాక దాని తాలూకు ఫీలింగ్ అలాగే మనతో కంటిన్యూ అవుతుంది. ఆ సినిమాలు మన మనసుల్లో ఉండిపోతాయి. థ్యాంక్ యు కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా చూసి బయటికి రాగానే ప్రతి ఒక్కరూ ఫోన్ తీసి కచ్చితంగా తమకు కావాల్సిన వాళ్లకు ఫోన్ చేస్తారు. ఈ సినిమా ప్రేక్షకులపై అలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది’’ అని దిల్ రాజు అన్నాడు.

This post was last modified on July 13, 2022 6:30 pm

Share

Recent Posts

సహజీవనంలోనూ గృహ హింసకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 minutes ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

9 minutes ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

58 minutes ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

1 hour ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

3 hours ago

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

3 hours ago