స్టార్ హీరోలకు పెళ్లీడు రాగానే వాళ్ల కంటే అభిమానులు పెళ్లి గురించి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతుంటారు. మీడియా వాళ్లు కూడా వాళ్లు దొరికినపుడల్లా పెళ్లి గురించి అడుగుతుంటారు. ఇక సోషల్ మీడియాలో హీరోల వివాహం గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రామ్ పెళ్లి గురించి కూడా ఈ మధ్య ఓ చర్చ జరిగింది.
అతను తన స్కూల్ డేస్‌లో ఇష్టపడ్డ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నాడని గట్టిగా ప్రచారం జరిగింది. దీని గురించి రామ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ ప్రచారాన్ని ఫన్నీ స్టయిల్లో ఖండించాడు. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘ది వారియర్’ ప్రమోషన్ల సందర్భంగా రామ్ మరోసారి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. స్కూల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ తన గురించి ప్రచారం చూసి ఇంట్లో వాళ్లు కూడా తనను అనుమానించారని రామ్ తెలిపాడు. అలాగే స్నేహితులు కూడా తన వైపు అనుమానంగా చూశారన్నాడు.ఏమీ లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు వస్తాయి అని తన స్నేహితులు కొందరు తనను ప్రశ్నించారని.. ఐతే ‘‘నేనసలు స్కూల్‌కి వెళ్తే కదా గర్ల్ ఫ్రెండ్ ఉండడానికి’’ అని వాళ్లను ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్న లాజికల్‌గా అనిపించి తనను నమ్మడం మొదలుపెట్టారని రామ్ చెప్పాడు.
అసలు తన గురించి ఈ ప్రచారం ఎలా జరిగిందో తనకు అర్థం కాలేదని రామ్ చెప్పాడు. ఐతే ఇప్పుడిలా అందరూ మాట్లాడుకున్నారు కదా అని హడావుడిగా పెళ్లి చేసుకోనని.. అది జరగాల్సినపుడు జరుగుతుందని రామ్ వ్యాఖ్యానించాడు. ఇక ‘ది వారియర్’ సినిమా గురించి చెబుతూ.. దర్శకుడు లింగుస్వామి కథ చెప్పాక తాను చాలా ఎగ్జైట్ అయి ఆ రోజు సాయంత్రానికే తాను పోలీస్ డ్రెస్ తెప్పించుకుని ఆ పాత్ర కోసం సన్నద్ధం అయినట్లు రామ్ చెప్పాడు. కమర్షియల్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఉంటూనే వైవిధ్యం కూడా ఉన్న సినిమా ఇదని, తన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు రామ్.
This post was last modified on July 13, 2022 5:11 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…