Movie News

థాంక్ యు కథ చెప్పేశారు

ఈ నెల 22న విడుదల కాబోతున్న నాగ చైతన్య థాంక్ యు మీద అక్కినేని అభిమానులకు గట్టి అంచనాలే ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో ఇప్పటికి ఏమంత బజ్ లేకపోయినా రిలీజ్ టైంకి ప్రమోషన్ల రూపంలో వచ్చేస్తుందని వాళ్ళ నమ్మకం. తాజాగా వచ్చిన ట్రైలర్ అంచనాలు అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళేలా లేదు కానీ మజిలీ, ప్రేమమ్, లవ్ స్టోరీ తరహా ఫీల్స్ ఉండటంతో యూత్ లో క్రేజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. విక్రమ్ కె కుమార్ టిపికల్ డైరెక్షన్ కన్నా ఒక వ్యక్తి సాఫ్ట్ జర్నీని చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.

చాలా స్పష్టంగా కథేంటో చెప్పేశారు. ఓ యువకుడు.. చిన్న ఊళ్ళో మొదలైన అతని టీనేజ్ లో అందరిలాగే ప్రేమకథలు ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి దక్కదు. ఇంకో ముద్దుగుమ్మేమో నువ్వు నా అన్నయ్యవని రాఖీ కట్టేసి తనను అవమానించిన వాళ్ళను చితకబాదిస్తుంది. అలా రెండు దశలు దాటాక ఇంకో లవర్ వస్తుంది. మనోడు గొప్ప స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత తను ఈ స్టేజికి రావడానికి కారణమైన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. నిజంగా అందరినీ కలిశాడా లేదా అనేదే అసలు కథ.

ఇలా అరటిపండు వలిచినట్టు స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే విప్పేశారు. సాఫ్ట్ జానర్ కాబట్టి మాస్ కు ఆకట్టుకునే అంశాలు ఏ మేరకు ఉన్నాయో సినిమాలోనే చూడాలి. ఇందులో చైతు మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపించనున్నాడు. దానికి సంబంధించిన థియేటర్ సీన్లు కూడా ఉన్నాయి. అవి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయని వేరే చెప్పాలా. మనం తర్వాత చైతుని డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ కె కుమార్ ఆ హిట్ సెంటిమెంట్ ని ఎంతమేరకు రిపీట్ చేస్తారో జూలై 22న చూడాలి. గ్యాంగ్ లీడర్ గాయం మానాల్సింది కూడా దీంతోనే.

This post was last modified on July 12, 2022 10:17 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago