తమిళ దర్శకుల పట్ల తెలుగు హీరోల మోజు ఈనాటిది కాదు. వాళ్లతో మన హీరోలు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే గత కొన్నేళ్లలో కోలీవుడ్ డైరెక్టర్ల ఊపు తగ్గింది. మన దర్శకుల జోరు పెరిగింది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుల వెంట పడడం మానేశారు మన హీరోలు. కాగా ఇటీవల తెలుగు హీరోల మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమిళ దర్శకులే తెలుగు హీరోల వెంట పడుతుండటం విశేషం.
రన్, పందెం కోడి, ఆవారా, వెట్టై లాంటి చిత్రాలతో భారీ విజయాలందుకుని ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగిన లింగుస్వామితో.. ఒక సినిమా చేయాలని ఆశపడ్డ టాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు. అందులో ఒకడు అల్లు అర్జున్. కానీ వీరి మధ్య కథా చర్చలు జరిగి, ఒక సినిమాకు రంగం సిద్ధమై అనౌన్స్‌మెంట్ కూడా అయ్యాక వ్యవహారం మారిపోయింది. లింగుస్వామి వరుసగా సికిందర్, పందెంకోడి-2 లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.
లింగుస్వామి టాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాడు కానీ.. అది మిడ్ రేంజ్ హీరో అయిన రామ్‌తో చేస్తున్న ‘ది వారియర్’ మూవీతో. ఈ సినిమా ఆయన కెరీర్‌కు చాలా కీలకం. తమిళ స్టార్లు ఆయనతో పని చేయడానికి అంతగా ఆసక్తి చూపించని నేపథ్యంలో తెలుగు స్టార్ల మీదే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూల్లో తెలుగు స్టార్లతో మరిన్ని సినిమాలు చేసే విషయమై ఆయన మాట్లాడాడు.
అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తే.. “ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా మధ్య గతంలో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. బన్నీ స్టైల్, ఎనర్జీ వేరు. ఆయన తిరుగులేని స్టార్. బన్నీలో నాకు నచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఆయనతో ఇంతకుముందు సినిమా కుదరకపోయినా.. త్వరలో కచ్చితంగా సినిమా చేస్తా. ‘ది వారియర్’ రిలీజయ్యాక దాని సంగతి తేలుతుంది” అని లింగుస్వామి చెప్పాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లతోనూ తాను సినిమాలు చేయాల్సిందని.. వారితో గతంలో సంప్రదింపులు జరిగాయని, భవిష్యత్తులో కుదిరితే చేస్తానని అన్నాడు లింగుస్వామి. రామ్‌తో తాను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు లింగుస్వామి చెప్పడం విశేషం.
This post was last modified on July 12, 2022 9:38 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…