రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. వేసవి సినిమాలతో థియేటర్లు కొంచెం కళకళలాడాయి. సీజన్ చివర్లో మేజర్, విక్రమ్ సినిమాలు కూడా బాగానే ఆడాయి. కానీ ఆ తర్వాత గత నెల రోజుల నుంచి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సినిమాలు వస్తున్నాయి. పోతున్నాయి. ఏవీ కూడా జనాలను ఆకర్షించలేకపోతున్నాయి. వీకెండ్లో సైతం థియేటర్లలో జనం కనిపించడం లేదు.
ప్రతి వారం కొత్త సినిమాలపై ఆశలు పెట్టుకోవడం, అవి నిరాశకు గురి చేయడం.. ఇదీ వరస. ఈ నెల ఆరంభంలో ‘పక్కా కమర్షియల్’ మీద ట్రేడ్ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఆ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుని వీకెండ్ అయ్యేసరికి బకెట్ తన్నేసింది. ఇక గత వారాంతంలో వచ్చిన ‘హ్యాపీ బర్త్ డే’ పరిస్థితి దయనీయం. ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. ఇంకా పాత సినిమాలైన విక్రమ్, మేజర్‌లే ఓ మాదిరిగా ఆడుతున్నాయి కానీ.. కొత్త సినిమాల పరిస్థితి ఘోరంగా ఉంది.
సరైన సినిమాలు లేకపోవడం, టికెట్ల ధరలు ఎక్కువైపోవడం.. ఈ కారణాలు చాలవన్నట్లు ఇప్పుడు వర్షాల దెబ్బ కూడా మొదలైంది. తెలంగాణలో నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇక్కడితో పోలిస్తే వర్షాలు కాస్త తక్కువే కానీ.. వాతావరణం అయితే అంత అనుకూలంగా లేదు. జనాలు పని ఉంటే తప్ప బయటికి రావట్లేదు. ఈ వర్షాల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి అసలే లేదు. దీంతో వెండితెరలు వెలవెలబోతున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమైపోతోంది. షోలు వేస్తే చేతి నుంచి డబ్బులు ఖర్చవుతుండడంతో ఎగ్జిబిటర్ల పరిస్తితి అయోమయంగా ఉంది. దీని కంటే ఊరికే ఉండడం మేలని షోలు ఆపేసి కూర్చుంటున్నారు.
మల్టీప్లెక్సులో ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే షోలు నడిపిస్తున్నారు. ఈ వారం రాబోతున్న ‘ది వారియర్’ సినిమాపై ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. కానీ వాతావరణం ఆ సినిమాకు అస్సలు సహకరించేలా లేదు. బుకింగ్స్ కూడా డల్లుగా జరుగుతున్నాయి. అధిక టికెట్ల రేట్లు కూడా దానికి ప్రతికూలంగా మారాయి. దీంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు టెన్షన్ తప్పట్లేదు. మరి వీకెండ్లో పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందేమో చూడాలి.
This post was last modified on July 12, 2022 5:49 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…