కరోనా వైరస్ వివిధ రంగాల్లో ప్రముఖుల్ని కూడా వదిలిపెట్టలేదు. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. కరోనా ఉన్నట్లు బయటపడ్డ ప్రముఖుడంటే బండ్ల గణేషే. ఆయనకు రెండు వారాల కిందట కరోనా ఉన్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. కానీ గణేష్ మాత్రం ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కరోనా పాజిటివ్‌గా తేలాక రెండు మూడు రోజులు ట్విట్టర్లో ఇన్ యాక్టివ్ అవ్వడంతోనే బండ్లకు వైరస్ సోకిందని చాలామంది అర్థం చేసుకున్నారు. చాలామంది సెలబ్రెటీలు ఓపెన్‌గా తమకు కరోనా ఉన్న సంగతి వెల్లడించి సామాన్య జనాల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేస్తుండగా.. బండ్ల మాత్రం సైలెంటుగా ఉన్నాడు.
ఐతే బండ్ల గణేష్ నుంచి మంగళవారం కరోనా అప్ డేట్ రావడం విశేషం. తనకు కరోనా ఉన్నట్లు చెప్పుకోని గణేష్.. ఇప్పుడు నెగెటివ్ వచ్చినట్లు అప్ డేట్ ఇవ్వడం విశేషం. కరోనా పరీక్షలో తనకు నెగెటివ్ వచ్చిన రిపోర్టును అతను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో అతడి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అయితే చాలామంది నెటిజన్లు అసలు మీకు కరోనా ఉన్నట్లు చెప్పలేదేంటి.. అప్పుడు సైలెంటుగా ఉండి ఇప్పుడు నెగెటివ్ వచ్చిందని ఎందుకు అప్ డేట్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. అయితే బండ్ల ఇదేమీ పట్టించుకోకుండా పాజిటివ్‌గా స్పందించిన వారికి జవాబులిస్తూ ఉండిపోయాడు. పౌల్ట్రీ బిజినెస్ నడిపే బండ్ల వ్యాపారంలో భాగంగా చాలామందితో కాంటాక్ట్ కావడంతో అతడికి కరోనా వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బండ్లకు ఇటీవలే ట్విట్టర్లో టిక్ మార్కు (అధికారిక ధ్రువీకరణ) రావడం విశేషం.
This post was last modified on July 1, 2020 8:51 am
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…
టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు…
బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్‌లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…