ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం హనుమాన్ జంక్షన్ రూపంలో డెబ్యూతోనే ఘనవిజయం అందుకున్న దర్శకుడు మోహన్ రాజా మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. పూర్తిగా తమిళంకే అంకితమైపోయి మన సూపర్ హిట్లనే అక్కడి హీరోలతో రీమేక్ చేసుకుంటూ సక్సెస్ ట్రాక్ కొనసాగించాడు. రెండు దశాబ్దాల కెరీర్ లో స్ట్రెయిట్ సబ్జెక్టుతో వచ్చిన బ్లాక్ బస్టర్ తని ఒరువన్ ఒకటి. దాన్నే రామ్ చరణ్ ధృవగా తీసి విజయం అందుకున్నాడు. కట్ చేస్తే ఇంత గ్యాప్ తర్వాత మోహన్ రాజాకు గాడ్ ఫాదర్ రూపంలో మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది
ఇదీ మలయాళం రీమేక్ అయినప్పటికీ చిరుకు ఇమేజ్ కి తగ్గట్టు మార్చేసుకుని వేగంగా పూర్తి చేయడం జరిగిపోతోంది. దీని సంగతలా ఉంచితే మోహన్ రాజాకు ఇప్పుడు టాలీవుడ్ లోనే మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగానే నాగార్జున నూరవ సినిమా బాధ్యతను తనకే అప్పగించారని ఫిలిం నగర్ టాక్. అఖిల్ ని స్పెషల్ క్యామియోలో చూపిస్తూ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టు సిద్ధం చేశారట. దీనికి సంబంధించిన చర్చలు నెలల క్రితమే చర్చలు జరిగినప్పటికీ స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడం వల్ల వెయిటింగ్ లో పెట్టేశారు.
దానికి తోడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ తో, నాగార్జున ది ఘోస్ట్ తో బిజీగా ఉండటం కూడా మరో కారణం. ఇప్పుడీ కలయిక దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. నాగ్ వందో సినిమాగా ఇది రూపొందనుంది. అయితే ది ఘోస్ట్ తొంబై తొమ్మిదోదా లేక తొంబై ఎనిమిదోదా అనే కౌంట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ దానికి సంబంధించిన క్లారిటీ కూడా త్వరలో ఇవ్వనున్నారు. బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న, ది ఘోస్ట్ అక్టోబర్ 5న విడుదల కానుండగా బిగ్ బాస్ సీజన్ 6 దసరా నుంచే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on July 12, 2022 3:36 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…