సహజంగానే ఒక డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చే హీరో సినిమాకు పెద్దగా బజ్ ఉండదు. పైగా ప్రొడక్షన్ హౌజ్ కూడా డిజాస్టర్ ఇస్తే ఇక అంతే సంగతులు. అయితే ఈ నెలాఖరున రిలీజ్ అవ్వనున్న ‘రామారావు’ పై ఇలాంటి ఎఫెక్ట్ పడుతుంది. అవును ఈ సినిమాపై రెండు డిజాస్టర్ల ప్రభావం ఉంది. దీనికి ముందు హీరో రవితేజ చేసిన ‘ఖిలాడి’ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బ తింది. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘విరాట పర్వం’ డిజాస్టర్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ సినిమాల ఎఫెక్ట్ రామారావు పై గట్టిగా పడుతుంది.
నిజానికి రామారావు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు దర్శకుడు కొత్త. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా ఎలా తీస్తాడనేది అంచనా లేదు. ఇవన్నీ కలిపి రామారావు బిజినెస్ ని ఇబ్బంది పెట్టాయని తెలుస్తుంది. దీంతో కొన్ని ఏరియాల్లో సొంతంగానే రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.
జులై 29న రవితేజ నటిస్తున్న ‘రామారావు’ థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే టీం ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. దర్శకుడు శరత్ మండవ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచే పనిలో ఉన్నాడు. రవితేజ ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. 25 నుండి మాస్ మహారాజా ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు గానూ రవితేజ పై చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి మాస్ మహారాజా ఎలాంటి సమాధానాలు ఇస్తాడో చూడాలి.
This post was last modified on July 11, 2022 10:13 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…