అట్లుంటది మనతోని అంటూ యూత్ కి విపరీతంగా ఎక్కేసిన డిజె టిల్లు ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దాని సీక్వెల్ కి ఇటీవలే శ్రీకారం చుట్టడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. దీని దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ చేస్తున్నవి చేయబోయేవి అన్నీ మరోసారి విశ్లేషించుకునే స్థాయికి మార్కెట్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ తో తీసిన భీమ్లా నాయక్ కన్నా సితార బ్యానర్ కి ఇదే ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచిన మాట వాస్తవం.
ఇందులో కీలకమైన హీరోయిన్ రాధిక పాత్రను సెకండ్ పార్ట్ లో పూర్తి స్థాయిలో కొనసాగించడం లేదట. ఆ స్థానంలో ఇంకో అమ్మాయిని తీసుకుని రాధికా క్యారెక్టర్ ని కొంత వరకు కొనసాగిస్తూనే నెగటివ్ షేడ్స్ ని కంటిన్యూ చేసేలా ఏదో కొత్త ట్రీట్మెంట్ రాసుకున్నట్టు తెలిసింది. హీరో సిద్దు, దర్శకుడు విమల్ కృష్ణ దీని కోసమే నెలల తరబడి కసరత్తు చేసినట్టు ఇన్ సైడ్ టాక్. నన్ను ఔలాగాన్ని చేసినావా రాధికా అంటూ టిల్లు చేసే అల్లరి ఇందులో కొత్త మలుపు తీసుకోబోతోంది. అయితే జట్టులో చేరిన కొత్త బ్యూటీ ఎవరో లీక్ కాలేదు.
మాములుగా ప్యాన్ ఇండియా మూవీస్ కే సీక్వెల్స్ వర్కౌట్ అవుతున్న ట్రెండ్ లో డీజే టిల్లు రెండో భాగానికి వెళ్లడం సాహసమే. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఇదే తరహాలో మనీ సెన్సేషన్ సృష్టించాక దానికి కొనసాగింపుగా మనీ మనీ వచ్చింది. కాకపోతే యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత అలాంటి ప్రయోగాలు మీడియం బడ్జెట్ సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు డీజే టిల్లు ఆ అడ్వెంచర్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే విడుదలకు ప్లాన్ చేసిన డీజే టిల్లు బిజినెస్ కూడా డబుల్ కాబోతోందని ట్రేడ్ టాక్
This post was last modified on July 11, 2022 10:04 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…