స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చివరి సినిమా గద్దలకొండ గణేష్ రిలీజై మూడేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటిదాకా అతడి తర్వాతి సినిమా మొదలే కాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఏడాది కిందట్నుంచి ఎదురు చూస్తున్నాడతను. కానీ పవన్ ఎంతకీ ఈ సినిమాకు డేట్లు కేటాయించట్లేదు. ఇదిగో అదిగో అనుకుంటూనే కాలం గడిచిపోతోంది.
సమీప భవిష్యత్తులో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపించకపోవడంతో హరీష్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాడని, యువ కథానాయకుడు రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఎప్పుడు ఏంటి అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. రామ్‌తో సినిమా చేయబోతున్న విషయాన్ని మాత్రం హరీష్ శంకర్ ధ్రువీకరించాడు. ఇందుకు రామ్ కొత్త చిత్రం ది వారియర్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక అయింది.
ఈ వేడుకకు అతిథుల్లో ఒకడిగా వచ్చిన హరీష్ శంకర్.. రామ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడాడు. అతడితో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని, అతడికి కథ కూడా చెప్పానని.. కానీ రకరకాల కారణాల వల్ల తమ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదని చెప్పాడు హరీష్.
రామ్‌కు కథ చెబితే తాను ఒక హీరో అని మరిచిపోయి ఒక ప్రేక్షకుడిలా వింటాడని.. తాను అతడికి ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పానని.. అందులో ఇద్దరు హీరోలని.. ఐతే కథ విన్నాక ఫ్యాన్ 2-3లో తిరుగుతున్నట్లు అనిపించిందని, మన కాంబినేషన్లో సినిమా వస్తే ఫ్యాన్ స్పీడ్ 5లో ఉన్నట్లు ఉండాలని రామ్ అన్నాడని.. ఆ మాటను తాను ఎప్పటికీ మరిచిపోలేనని హరీష్ అన్నాడు. ఇక రామ్‌తో ఇప్పుడు సినిమా చేసే విషయమై హరీష్ మాట్లాడుతూ.. తమ కాంబినేషన్లో కచ్చితంగా సినిమా వస్తుందని.. అది ఎప్పుడు ఏంటన్నది చెప్పలే.
This post was last modified on July 11, 2022 5:00 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…