మెగాస్టార్ చిరంజీవితో మాస్ రాజా రవితేజ సుదీర్ఘ విరామం తర్వాత జట్టు కట్టబోతున్నట్లుగా గత ఏడాదే సమాచారం బయటికి వచ్చింది. గతంలో వీళ్లిద్దరూ ‘అన్నయ్య’ సినిమాలో నటించారు. ఐతే అప్పటికి రవితేజ హీరో కాదు. అతడికి ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద మాస్ హీరోల్లో రవితేజ ఒకడు.
సోలో హీరోగా ఒక రేంజిలో ఉన్న అతను.. వేరే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసే స్థితిలో లేడు. కాబట్టి ఇప్పుడు చిరుతో జత కడుతున్నాడంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘పవర్’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన కేఎస్ రవీంద్ర (బాబీ) మీద అభిమానంతో, అలాగే చిరు మీద ప్రేమతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించడానికి రవితేజ ముందుకొచ్చినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మాస్ రాజా ఈ సినిమా చేయలేకపోతున్నట్లుగా ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. కానీ ఈ వార్తలు నిజం కాదని తేలింది.
అతి త్వరలోనే మాస్ రాజా ‘వాల్తేరు వీరయ్య’ సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం నెల రోజులకు పైగానే డేట్లు కేటాయించాడట రవితేజ. ఇటీవలే ‘రామారావు ఆన్ డ్యూటీ’ పని పూర్తి చేసిన రవితేజ.. తన సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని చిరు సినిమా కోసం డేట్లు ఇచ్చాడట.
హైదరాబాద్‌లోనే కాక ఫారిన్లో జరిగే షెడ్యూళ్లలో అతను పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరుకు సోదరుడిగా రవితేజ నటించబోతున్నాడని.. అతడి ఇమేజ్‌కు తగ్గ మాస్ పాత్ర ఇదని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పని పూర్తయ్యాకే ‘ధమాకా’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడట రవితేజ.
చిరు సినిమాలో నటించడానికి రవితేజ భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడే క్రమంలో రవితేజ బదులు చిన్న ఆర్టిస్టును పెట్టుకుందామని అనుకున్నారు కానీ.. మాస్ రాజా ఈ పాత్రను చేస్తే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో రాజీ పడకుండా అతడితోనే వెళ్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 11, 2022 2:28 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…