డాన్స్ మాస్టర్ గా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ గుర్తింపే ఉన్న అమ్మ రాజశేఖర్ కు హీరో నితిన్ మీద కోపమొచ్చింది. సాధారణంగా టెక్నీషియన్ ఎవరైనా సరే పబ్లిక్ స్టేజిల మీద స్టార్లను విమర్శించేందుకు ఆలోచించే పరిస్థితుల్లో నేరుగా తిట్ల బాణాలు గుప్పించడం మీడియాకు సైతం షాక్ కలిగించింది. విషయంలోకి వెళ్తే అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో హైయ్ ఫైవ్ అనే సినిమా రూపొందింది. దీన్ని ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు తీశారో ఎవరు నటించారో కూడా తెలియనంత గప్ చుప్ గా షూటింగ్ జరిగింది.
నిన్న దీని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అమ్మ రాజశేఖర్ పది రోజుల క్రితం నితిన్ ని అతిథిగా పిలిచాడు. అతనూ వస్తానని మాటిచ్చాడు. తీరా చూస్తే జ్వరమని చెప్పి చివరి నిమిషంలో నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఇందులో నిజం లేదంటున్నాడు రాజశేఖర్. గత రెండు వారాలుగా నితిన్ కి షూటింగ్ లేదని, కేవలం సాకుగా ఆరోగ్యం గురించి చెబుతున్నారని, కెరీర్ ప్రారంభంలో డాన్స్ రాని తనకు ఆ మెళకువలు నేర్పిస్తే ఇప్పుడు ఆ కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. నితిన్ గతంలో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలోనే టక్కరి సినిమా చేశాడు. అఫ్కోర్స్ అది డిజాస్టర్ కావడం వేరే సంగతి.
మొత్తానికి జీరో బజ్ ఉన్న ఈ మూవీకి ఇపుడీ కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చేసింది. అలా అని థియేటర్లకు జనం పొలోమని వస్తారని కాదు కానీ కనీసం ఇదొకటి ఉందన్న విషయమైతే గుర్తుకు వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే దీనికి తమన్ సంగీతం సమకూర్చారట. అసలు తమన్ ఎప్పుడూ దీని గురించి ప్రస్తావన తీసుకురావడం కానీ దానికి సంబంధించిన మ్యూజిక్ అప్ డేట్స్ ఇవ్వడం కానీ జరగలేదు. మరి ఈ హైయ్ ఫైవ్ ఎప్పుడు చేశారో ఏమిటో. పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ రాని పరిస్థితుల్లో దీన్ని జనం థియేటర్లలో చూస్తారా.
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…