కాస్త మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రతి హీరో పోలీస్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటాడు. మాస్, యాక్షన్ అంశాలను ఎలివేట్ చేయడానికి పోలీస్ క్యారెక్టర్ని మించిన ఆప్షన్ కనిపించదు. అందుకే అందరు హీరోలూ ఆ పాత్రలపై మక్కువ చూపుతారు.
ఐతే యువ కథానాయకుడు రామ్ మాత్రం పోలీస్ స్టోరీలంటూ వ్యతిరేక భావం పెంచుకున్నాడట. ఇప్పుడు తాను పోలీస్ పాత్ర చేసిన ది వారియర్ మూవీ విషయంలోనూ విముఖతతోనే ఉన్నాడట. అందుక్కారణం.. ఎవరు పోలీస్ కథను తన ముందుకు తెచ్చినా అవన్నీ ఒకేలా ఉండడమే కారణమట.
ది వారియర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ తాను ఈ సినిమా చేయడానికి ముందు అయిదు పోలీస్ కథలు వినగా.. అవన్నీ ఒకేలా ఉన్నాయని.. అందుకే ఎవరైనా పోలీస్ స్టోరీ చెబుతానంటే ఆసక్తి పోయిందని చెప్పాడు.
ఐతే లింగుస్వామి తనకు ఇది పోలీస్ కథ అని చెప్పకుండా.. స్టోరీ నరేషన్‌కు వచ్చారని, తాను ఫార్మాలిటీ కోసమే ఆ కథ వినడానికి సిద్ధమయ్యానని.. కానీ ఆయన చెప్పిన కథ విన్నాక స్పెల్ బౌండ్ అయిపోయానని.. ఇలాంటి కథ కదా మనం చేయాల్సింది అనిపించిందని రామ్ తెలిపాడు. తాను ఎప్పుడూ ఒక కథ విన్నాక ఎగ్జైట్ అయి ట్వీట్ చేసింది లేదని, కానీ ఈ సినిమాకు అలా చేశానని రామ్ తెలిపాడు.
ఈ సినిమాలో సత్య పాత్ర కోసం రోజుకు రెండుసార్లు జిమ్ చేశానని.. ఈ క్రమంలో తనకు గాయాలయ్యాయని.. డాక్టర్ని కలిస్తే సినిమా ముఖ్యమా, జీవితం ముఖ్యమా అని ప్రశ్నించాడని రామ్ గుర్తు చేసుకున్నాడు. ఐతే ఆ సమయంలో ట్విట్టర్ ఓపెన్ చేసి అభిమానుల మెసేజ్‌లు చదివితే వాళ్ల అన్ కండిషనల్ లవ్ తెలిసిందని, అభిమానులు లేకపోతే తాను లేనని అర్థమైందని రామ్ అన్నాడు. ఇక ఈ ఈవెంట్లో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. రామ్‌తో తాను పది సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పడం విశేషం. తనకు, రామ్‌కు అదృష్టం ఉంటే అది జరుగుతుందని ఆయన అన్నాడు.
This post was last modified on July 11, 2022 10:34 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…