టాలీవుడ్ హీరోయిన్లలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే సొంతంగా మంచి మార్కెట్ కూడా ఉన్న కథానాయికల్లో సమంత ఒకరు. ఆమె ఇప్పటికే ఓ బేబీ, యుటర్న్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుకుంది. ఆ సినిమాలకు వచ్చిన స్పందన చూసే సీనియర్ దర్శకుడు గుణశేఖర్ సామ్ ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ చిత్రం తలపెట్టాడు. చరిత్రలో బాగా పాపులర్ అయిన శకుంతల దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
ఇంతకుముందు రుద్రమదేవి సినిమాతో పెద్ద రిస్క్ చేసి అతి కష్టం మీద బయటపడిన గుణశేఖర్.. శాకుంతలం కోసం అలాంటి సాహసమే చేశాడు. ఆయనకు అగ్ర నిర్మాత దిల్ రాజు అండగా నిలిచాడు. ఐతే ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదే పూర్తయింది. సమంత ఈ చిత్రం నుంచి రిలీవ్ అయి వేరే చిత్రాల్లో నటిస్తోంది. కానీ ఎంతకీ శాకుంతలం రిలీజ్ సంగతే తేలట్లేదు.
శాకుంతలం సినిమా గురించి జనం మరిచిపోయి చాలా కాలం అయింది. ఎంత విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పని ఎక్కువ ఉన్నా సరే.. మరీ ఇంత సమయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కనీసం అప్పుడప్పుడూ అప్‌డేట్స్ అయినా ఇవ్వడం, సినిమా నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవడం చేయాలి. కానీ శాకుంతలం టీం అలాంటిదేమీ చేయడం లేదు. సమంత కూడా ఈ సినిమాను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో ఆమె అభిమానుల్లో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి పోయింది.
ఐతే ఓ అభిమాని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాత నీలిమ గుణను శాకుంతలం సినిమా గురించి అడగ్గా.. ఫస్ట్ టీజర్, ఇతర అప్‌డేట్స్ అతి త్వరలో రాబోతున్నాయని వెల్లడించింది. ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా.. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారా అని అడిగితే.. ఈ ఏడాదే అని కూడా బదులిచ్చింది. ఎట్టకేలకు శాకుంతలం టీం నుంచి కదలిక రావడంతో ఇకనైనా సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on July 10, 2022 10:00 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…