బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ‘అందాల రాక్షసి’ సినిమా ఫ్లాపే. మామూలుగా తొలి సినిమా ఫ్లాప్ అయిన హీరోయిన్లను ఇండస్ట్రీ అంతగా పట్టించుకోదు. కానీ లావణ్య త్రిపాఠి విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. ఆ సినిమాలో ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయింది. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు భిన్నంగా కనిపిస్తూ ముగ్ధమనోహరమైన అందంతో యూత్‌కు పిచ్చెక్కించేసింది లావణ్య. ఆ తర్వాత ఆమెకు అవకాశాలకు లోటు లేకపోయింది. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్లు పడ్డాయి లావణ్యకు. కాకపోతే పెద్ద స్టార్ల సరసన, భారీ చిత్రాల్లో అవకాశాలు రాలేదన్నదే ఆమెకు లోటు.
కెరీర్లో తర్వాత ఆ దశకు కూడా చేరుతుందిలే అనుకుంటే.. ఉన్న స్థానాన్ని కోల్పోయిందామె. ఎలాంటి కథానాయికకు అయినా అప్పుడప్పుడూ ఓ హిట్ అవసరం. వరుసగా ఫ్లాపులు వస్తే డిమాండ్ తగ్గిపోతుంది. అవకాశాలు ఆగిపోతాయి. లావణ్య పరిస్థితి కూడా అలాగే తయారైంది.
ఎ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల తర్వాత లావణ్య కెరీర్ మరీ డల్లయిపోయింది. ఇలాంటి టైంలో ఆమెకు మంచి హిట్ ఒకటి అవసరం అయింది. ఆ లోటును ‘హ్యాపీ బర్త్ డే’ తీరుస్తుందని ఆశించింది లావణ్య. కెరీర్లో తొలిసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ టచ్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నందుకు ఆమె చాలా ఎగ్జైట్ అయింది కూడా. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా రూపొందించిన ఈ చిత్రం వెరైటీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ కేవలం ప్రచార హడావుడి తప్ప సినిమాలో విషయం లేదని థియేటర్లకు వెళ్లాక కానీ తెలియలేదు.
తొలి రోజే డల్ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం.. నెగెటివ్ టాక్, వర్షాల ప్రభావంతో ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. వీకెండ్లోనే సినిమా ప్రభావం చూపలేదు. ఇక సోమవారం నుంచి షోలు రన్ కావడం కూడా కష్టమే. ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రమోషన్ల పరంగా ఎంతో కష్టపడ్డ లావణ్యకు ఇది పెద్ద షాకే. ఈ దెబ్బతో ఇక ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆమెను రక్షించేదెవరో?
This post was last modified on July 10, 2022 9:51 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…