Movie News

నితిన్ మాస్టర్ స్ట్రోక్

యువ కథానాయకుడు నితిన్‌కు ఇప్పుడు అర్జెంటుగా ఒక మంచి హిట్ కావాలి. అతడి చివరి థియేట్రికల్ రిలీజ్ ‘రంగ్ దె’ యావరేజ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గానే నిలిచింది. అంతకంటే ముందు వచ్చిన ‘చెక్’ డిజాస్టర్ అయింది. ‘మేస్ట్రో’ ఏమో ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. కాబట్టి నితిన్‌కు ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం.

గత సినిమాల ఫలితాలతో భయపడి కెరీర్లో అత్యధిక బడ్జెట్లో చేయాలనుకున్న ప్రయోగాత్మక చిత్రం ‘పవర్ పేట’ను అతను పక్కన పెట్టేశాడు. దీని స్థానంలో ఎడిటర్ శేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే పక్కా మాస్ మసాలా మూవీని లైన్లో పెట్టాడు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ‘మాస్’ టచ్‌‌తోనే కనిపించాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘రా రా రెడ్డి నేను రెడీ’ అనే పాటను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అది ఇన్‌స్టంట్‌గా జనాలకు ఎక్కేసింది.

‘రా రా రెడ్డి’ పాట లాంచ్ కార్యక్రమాన్ని చిన్న స్థాయి ప్రి రిలీజ్ ఈవెంట్ తరహాలో చేసింది నితిన్ ఫ్యామిలీ. ఒక పాటకు ఇంత హడావుడి చేయడం ఏంటని అనిపించొచ్చు. ఐతే ఈ సాంగ్ లిరికల్ వీడియో చూస్తే.. ఈ హంగామా వ్యూహాత్మకంగా చేసిందే అని అర్థమవుతుంది. ఈ పాట‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. భారీ సెట్టింగ్స్, వందల మంది జనం మధ్యలో చాలా పెద్ద ఎత్తునే పాటను చిత్రీకరించినట్లున్నారు. జానీ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్ నృత్యరీతులు సమకూర్చగా.. నితిన్, అంజలి ఊర మాస్ డ్యాన్సులతో అదరగొట్టేశారు. అంజలి కెరీర్లోనే ఎన్నడూ లేనంత హాట్‌గా కనిపిస్తోంది ఈ పాటలో.

ఈ సాంగ్‌లో మిగతా విషయాలన్నీ ఒకెత్తయితే.. ‘జయం’ సినిమాలోని రాను రానంటూనే చిన్నది లైన్‌ను వాడుకోవడం.. దానికి నితిన్, అంజలి ఊర మాస్ స్టెప్పులేయడం మరో ఎత్తు. అప్పట్లో ఆ పాట ఎంత పెద్ద సెన్సేషనో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రం రిలీజై 20 ఏళ్లు పూర్తవుతుండగా.. మళ్లీ ప్రేక్షకులకు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తూ నితిన్ సినిమాలో ఈ పాట పెట్టడం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది. రేప్పొద్దున థియేటర్లలో ఈ పాట మాస్ ప్రేక్షకులను ఊపేసేలాగే ఉంది. సినిమాకు సంబంధించి ఈ పాట నితిన్ అండ్ టీం ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌ లాగా కనిపిస్తోంది. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on July 10, 2022 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

1 hour ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

2 hours ago

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

5 hours ago

లోకేష్‌తో సినిమాపై తేల్చేసిన స్టార్ హీరో

కూలీ సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో.. ఎన్ని ఊహాగానాలు…

6 hours ago

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

9 hours ago

అమెరికాలో లోకేష్… టీ-11 కు నిద్ర పట్టట్లేదా?

పెట్టుబ‌డులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమెరికా స‌హా పొరుగున ఉన్న‌…

10 hours ago