ఇప్పుడంత హడావిడి కనిపించడం లేదు కానీ సెప్టెంబర్ 9న విడుదలయ్యే నాటికి బ్రహ్మాస్త్ర హైప్ ఓ రేంజ్లో ఉంటుంది. తెలుగు వెర్షన్ కు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం, నాగార్జున కీలక పాత్ర చేయడం ఇవన్నీ ఇక్కడి బిజినెస్ కి బాగా ఉపయోగపడేవే. నిర్మాత కరణ్ జోహార్ అన్ని భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు స్కెచ్ వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లను మించి అత్యథిక స్క్రీన్లలో బ్రహ్మస్త్రను ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సౌత్ లోనూ ఎవరూ ఇప్పటిదాకా పోటీకి పోవడం లేదు.
కానీ ఓ చిన్న హీరో మాత్రం ఆ విజువల్ గ్రాండియర్ తో ఢీకి సై అంటున్నాడు. నేను మీకు బాగా కావాల్సిన వాడిని అదే రోజు రాబోతున్నట్టు ఇందాక టీజర్ తో పాటు అఫీషియల్ గా ప్రకటించారు. ఎస్ ఆర్ కళ్యాణమండపంతో కిరణ్ కు మొదటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ కావాల్సిన వాడిని ముందు డైరెక్ట్ చేసింది మల్లువుడ్ నుంచి వచ్చిన కార్తీక్ శంకర్. అయితే రషెస్ సరిగా రాలేదనో ఇంకేదైనా కారణాలు ఉందో చెప్పలేదు కానీ సగం అయ్యాక శ్రీధర్ గాదెని రంగంలోకి దింపారు.
ట్రైలర్ ఓ మోస్తరుగా క్లాస్ ని మాస్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే బ్రహ్మస్త్రతో ఢీ కొట్టేంత మ్యాటర్ ఉందా అంటే చెప్పలేం. అసలే కిరణ్ అబ్బవరం సినిమాల ప్రమోషన్ లో కనిపించినంత మ్యాటర్ థియేటర్ లో ఉండటం లేదు. సెబాస్టియన్ దారుణంగా దెబ్బ కొట్టగా సమ్మతమేలోని నెమ్మదితనాన్ని ఆడియన్స్ అంగీకరించలేదు. ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాప్ పడకుండా ఉండాలంటే ఈ నేను మీకు బాగా కావాల్సినవాడిని బాగా ఆడాల్సిందే. పెద్ద క్లాష్ కే సిద్ధపడిన ఈ కుర్ర హీరో కాన్ఫిడెన్స్ ఏంటో 9న తేలనుంది
This post was last modified on July 10, 2022 11:45 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…