‘సిసింద్రీ’ సినిమాతో చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సంపాదించి.. పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయడానికి ముందే యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుని తనపై భారీ అంచనాలు నెలకొనేలా చేసిన కుర్రాడు అక్కినేని అఖిల్. హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ మీద అంచనాలు మామూలుగా లేవు అప్పట్లో. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫలితాల గురించీ తెలిసిందే. వరుసగా మూడు డిజాస్టర్లతో వచ్చిన క్రేజ్ అంతా పోగొట్టుకుని క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డాడు అక్కినేని వారసుడు.
ఇలాంటి స్థితిలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అతడి కోసం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను సెట్ చేశాడు. ఆ సినిమా కూడా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. చివరికి బాక్సాఫీస్ దగ్గర పాసైపోయింది. అఖిల్ ఖాతాలో తొలి హిట్ చేరింది. ఇప్పుడు అక్కినేని వారసుడి ఆశలు ‘ఏజెంట్’ మీద ఉన్నాయి. కానీ ఈ సినిమా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఈ లోపు అఖిల్ కొత్త సినిమా గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
వరుసగా అఖిల్ సినిమాల కోసం పెద్ద పెద్ద నిర్మాతల్ని సెట్ చేస్తున్న నాగార్జున.. ఈసారి చిన్న కొడుకుని దిల్ రాజు చేతుల్లో పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజుతో నాగ్‌కు మంచి అనుబంధమే ఉంది. ఆయన పెద్ద కొడుకు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసింది దిల్ రాజు. ఇప్పుడు చైతూతో ‘థ్యాంక్ యు’ సినిమా కూడా తీశాడు. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాను నిర్మించడానికి ఆయన ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
‘వకీల్ సాబ్’ విజయాన్నందుకున్నప్పటికీ.. తాను కోరకున్న స్థాయిలో పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను రాజు ప్రొడ్యూస్ చేయనున్నాడట. ‘వకీల్ సాబ్’ తర్వాత అల్లు అర్జున్‌తో ‘ఐకాన్’కు రంగం సిద్ధం చేసినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. వేరే స్టార్లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని అఖిల్ కోసం కథ రెడీ చేశాడట వేణు. దిల్ రాజు ఈ కథకు ఓకే చెప్పడం, అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 9, 2022 7:08 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…