Movie News

సినిమా చూద్దామని వెళ్తే.. మీమ్ ఫెస్ట్ చూపించాడు


హ్యాపీ బర్త్ డే.. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ల పరంగా చాలా వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా. చిన్న సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలనే విషయంలో ఒక రోల్ మోడల్ లాగా నిలిచిందీ చిత్రం. ఐతే ప్రమోషన్లలో అంత ఫన్, సెన్సాఫ్ హ్యూమర్ చూపించిన చిత్ర బృందం.. సినిమాలో ఇంకెంత వినోదాన్ని పంచి ఉంటుందో, ఎంత థ్రిల్ చేస్తుందో అని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. కొంత మేర కామెడీ బాగానే వర్కవుట్ అయినా.. ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం సరిగా లేక డివైడ్ టాక్ తెచ్చుకుందీ చిత్రం.

ఐతే ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగా నచ్చే అవకాశముంది. అందుక్కారణం.. దర్శకుడు రితేష్ రాణా సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బాగా ఫాలో కావడం, సినిమా అంతా కూడా ‘మీమ్’ కంటెంట్‌తో నింపేయడం. ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో ఉండేదే ఇక్కడ వచ్చే ట్రెండీ మీమ్స్ కోసమే. వాటిని వాళ్లు మామూలుగా ఎంజాయ్ చేయరు. వీళ్లను ఆధారంగా చేసుకునే బోలెడన్ని మీమ్ పేజెస్ బతుకుతుంటాయి.

తెలుగులో ఉన్న స్థాయిలో మీమ్ పేజీలు, ఇక్కడ వచ్చే స్థాయి మీమ్స్ ఇండియాలో మరే భాషలోనూ రావు అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజిలో ఉంటుంది మనోళ్ల క్రియేటివిటీ. వీళ్ల మీమ్స్‌కు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ‘హ్యాపీ బర్త్ డే’ దర్శకుడు కూడా ఈ మీమ్ పేజీలను బాగా ఫాలో అయ్యేలాగే ఉన్నాడు. సినిమాలో దాదాపు ప్రతి సీన్లోనూ ఏదో పేరడీ, సెటైర్ ఉండేలా సీన్లు రాసుకున్నాడు. బోయపాటి ఓ ఇంటర్వ్యూలో అన్న ‘జై’ అనే మాటను వాడడం.. కోపధారి మనిషి మీమ్‌ను చూపించడం.. మీమర్స్ తరచుగా వాడే బ్రహ్మి ‘లెట్స్ బిగిన్ ద షో’ డైలాగ్‌ను వాడడం.. ఇలా సినిమాలో ఎటు చూసినా మీమ్ కంటెంటే.

అలాగే టిక్ టాక్ వీడియోల్లో అబ్బాయిలు అమ్మాయిల్లా మారి చేసే విన్యాసాలను గుర్తు చేస్తూ వెన్నెల కిషోర్‌తో ఆ టైపు వీడియోలు చేయించాడు. కిషోర్‌ను ఆ సీన్లలో చూస్తే అందరికీ ఉప్పల్ బాలునే గుర్తుకొచ్చాడు. అలాగే కిషోర్‌ను మోనాలిసా ఆర్ట్ సహా రకరకాల అవతారాల్లో చూపించడం.. వాట్సాప్ కోట్స్‌తో హింసించే పాత్రలో గుండు సుదర్శన్‌ను చూపించడం.. ఇలా ‘హ్యాపీ బర్త్ డే’ చూడ్డానికి వచ్చిన వాళ్లకు సినిమా కాకుండా మీమ్ ఫెస్ట్ చూపించాడు రితేష్ రాణా. వీటి వరకు అతను ఫన్ జనరేట్ చేసినా.. కథాకథనాలు మరీ వీక్‌గా ఉండడంతో సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

This post was last modified on July 9, 2022 3:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

2 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

6 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

11 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

12 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

13 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

14 hours ago