దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్లో పూర్తిగా ఫామ్, ఫేమ్ కోల్పోయాక టాలీవుడ్‌కు తిరిగొచ్చేసిన ఆయన.. ఇక్కడ కొన్నేళ్ల నుంచి మరీ నాసిరకమైన సినిమాలు తీస్తున్నాడు. ఒకప్పుడు వర్మ సినిమా అంటే ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి ఎగబడి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద ఎత్తున థియేటర్లిచ్చి ప్రదర్శించిన ఎగ్జిబిటర్లు ఇప్పుడు ఆయన సినిమా అంటేనే భయపడి పారిపోతున్నారు.
వర్మ చివరి రెండు సినిమాలు కొండా, డేంజరస్‌లకు కనీస స్థాయిలో కూడా థియేటర్లు దొరకలేదు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఈ చిత్రాలు ఏదో నామమాత్రంగా రిలీజై.. వీకెండ్లోనే అడ్రస్ లేకుండా పోయాయి. ‘డేంజరస్’ సినిమానైతే థియేటర్లు దొరక్క వాయిదాల మీద వాయిదాలు వేసుకోవాల్సి వచ్చింది. అయినా వర్మలో అంతర్మథనం ఏమీ లేదు. ఎలాగోలా నిర్మాతల్ని పట్టుకుంటున్నాడు. తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
వర్మ నుంచి ఇప్పుడు ‘లడ్కీ’ అనే సినిమా రాబోతోంది. పూజా భలేకర్ అనే ముంబయి అమ్మాయిని పెట్టి వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్, స్టంట్లు చేయించాడు. ఆమెను వర్మ లేడీ బ్రూస్‌లీగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. విచిత్రమైన భంగిమల్లో పోజులు ఇప్పించి హాట్ హాట్ ప్రోమోలు చాలానే వదిలాడు వర్మ ఇప్పటిదాకా. కానీ అవేవీ మన ప్రేక్షకులను ఎగ్జైజ్ చేయట్లేదు. మధ్యలో చాన్నాళ్లు వార్తల్లో లేని ఈ చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేయడానికి చూస్తున్నాడు వర్మ.
‘లడ్కీ’ని వర్మ చైనాలో కూడా రిలీజ్ చేస్తుండటం విశేషం. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం, హీరోయిన్ని లేడీ బ్రూస్‌లీగా పేర్కొంటుండటం వల్ల అక్కడి వారికి ఆసక్తి కలిగిందేమో. వర్మ ట్రాక్ రికార్డు చూడకుండా సినిమాను రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ ముందుకొచ్చినట్లున్నాడు. కానీ వర్మ చైనా రిలీజ్ గురించి చేస్తున్న ప్రకటనలే విడ్డూరంగా ఉన్నాయి. చైనాలో ఏకంగా 40 వేల థియేటర్లోల ఈ సినిమా రిలీజవుతున్నట్లు వర్మ చెబుతున్నాడు. కానీ చైనాలో ‘బాహుబలి’ లాంటి సినిమానే పది వేల స్క్రీన్లలో రిలీజైంది. ఆ దేశంలో రికార్డు స్థాయిలో 75 వేల స్క్రీన్లు ఉన్న మాట వాస్తవం. కానీ అందులో సగానికి పైగా థియేటర్లలో వర్మ సినిమాను ప్రదర్శిస్తారంటే నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఇండియాలో కూడా సినిమాకు హైప్ తేవడానికే వర్మ ఇలా అతిశయోక్తితో కూడిన ప్రకటనలు చేస్తున్నాడేమో అనిపిస్తోంది.
This post was last modified on July 9, 2022 2:18 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…