టైటిలేమో మలయాళంది అలాగే పెట్టేశారు. అడిగితే హీరో పేరు అదే ఉంటుంది, దానర్థం పులి అని హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తెలుగు మీడియా టాక్ లో కవర్ చేయబోయే ప్రయత్నం చేశారు కానీ మొత్తానికి మన బాష పట్ల కోలీవుడ్, మల్లువుడ్ మేకర్స్ దృక్పథం ఎలా ఉందో క్రమం తప్పకుండా ఇటీవలి కాలంలో బయట పడుతూనే ఉంది. వలిమై, తలైవి, సుడల్ ఇలా చెప్పుకుంటూ పొతే సినిమా వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా కనీసం తెలుగులో సరైన టైటిల్ పెట్టేందుకు కూడా బద్దకించి ఒరిజినల్ ని అలాగే ప్రమోట్ చేస్తున్నారు.
సరే దీని సంగతలా ఉంచితే కడువా నిన్న కేరళలో రిలీజయ్యింది. అదే రోజు ఇక్కడా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కుదరలేదు. హైదరాబాద్ కొన్ని థియేటర్లలో మలయాళం వెర్షన్ రన్ చేశారు. కట్ చేస్తే తెలుగు డబ్బింగ్ ఒక రోజు ఆలస్యంగా 8 అన్నారు. అదీ జరగలేదు. ఇప్పుడు ఫైనల్ గా 9న శనివారం అని ప్రకటించారు. దొరికిన కొద్దిపాటి స్క్రీన్లతో బుకింగ్స్ అయితే పెట్టారు కానీ ఒక్క టికెట్ అమ్ముడుపోతే ఒట్టు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ తప్ప బుక్ మై షోలో ఇంకో స్క్రీన్ కనిపించడం లేదు. న్యూస్ పేపర్ లో మాత్రం వేరే లిస్టు పెట్టారు.
ఈలోగా కడువా టాక్ బయటికి వచ్చేసింది. రొటీన్ మాస్ ఎంటర్ టైనరని, అదే పనిగా వెళ్లి చూసేందుకు అంత మ్యాటర్ లేదనేలా రివ్యూలు స్పష్టం చేశాయి. ఇవి సోషల్ మీడియాలో ఆల్రెడీ సర్కులేషన్ లో వచ్చేశాయి. అయినా ప్రాపర్ గా ముందే ప్లాన్ చేసుకుంటే ఈ తిప్పలు తప్పేవిగా. ఇంతకు ముందు జనగణమణని ఇదే తరహాలో పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తే ఎవరూ పట్టించుకోక చివరికి అందరూ నెట్ ఫ్లిక్స్ లో చూశారు. ఇప్పుడీ కడువాని ప్రత్యేకంగా హాలులో చూసేంత సీన్ ఉందా అంటే డౌటే.
This post was last modified on July 8, 2022 2:58 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…