కెరీర్ మొదలుపెట్టాక హిట్లు తప్ప కనీసం యావరేజ్ లేకుండా జైత్రయాత్ర సాగించిన దర్శకుడు కొరటాల శివకు ఆచార్య ఎంత పెద్ద ఝలక్ ఇచ్చిందో చూశాం. పేరు డ్యామేజ్ అవ్వడమే కాదు నష్టాల పరంగానూ దెబ్బ తినాల్సి వచ్చింది.
డైరెక్షన్ కే పరిమితం కాకుండా డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ భాగస్వామ్యం లాంటి వ్యవహారాల్లో తల దూర్చడంతో అన్ని వైపులా ఆచార్య చేసిన గాయం అంతా ఇంతా కాదు. సరే హిట్లు ఫ్లాపులు ఎవరికైనా సహజమే కానీ నాలుగేళ్ల కష్టానికి దక్కాల్సిన ప్రతిఫలం ఈ రూపంలో ఉండకూడదన్నది వాస్తవం.
సరే ఇప్పుడు కొరటాల ఫోకస్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీదే ఉంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది. అలియా భట్ డ్రాప్ అయ్యాక ఆ స్థానాన్ని రీ ప్లేస్ చేయడం పెద్ద సవాల్ గా మారింది.
దానికి తోడు స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ ఇంకా లాక్ అవ్వలేదని వినిపిస్తోంది. తారక్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, కొన్ని మార్పులు చెప్పాడని అవి కాగానే షెడ్యూల్స్ లాక్ చేస్తారని వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ కాబట్టి ఆ అంచనాలు అందుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి.
ఇదిలా ఉంటే కొరటాల శివకు ప్రభాస్ ఓ కమిట్ మెంట్ ఇచ్చాడనే వార్త ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది. ఎందుకంటే శివ డెబ్యూ మూవీ మిర్చి ఇప్పటికీ డార్లింగ్ అభిమానులు గొప్పగా చెప్పుకునే కమర్షియల్ బ్లాక్ బస్టర్. ఆ స్థాయి బొమ్మ ఒకటి పడాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
కాకపోతే దీనికి చాలా టైం పడుతుంది. ఆది పురుష్, సలార్, రాజా డీలక్స్(ప్రచారంలో ఉన్న టైటిల్), ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఇవన్నీ పూర్తయ్యేనాటికి 2024 దాటిపోతుంది. అప్పటికంతా కొరటాల ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉండొచ్చు. సో వెయిటింగ్ చాలా ఉంది
This post was last modified on July 8, 2022 1:59 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…