థియేటర్లో వచ్చిన తక్కువ రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటిటిలో వస్తున్నాయి కదా పైరసీ ఇంకెక్కడుందని కొందరు అనుకోవచ్చు కానీ నిజానికి డిజిటల్ కంటెంట్ పెరిగాక వీటి దూకుడు ఇంకా ఎక్కువయ్యింది. అన్ని యాప్స్ కి చందాలు తీసుకోలేని సగటు సినీ ప్రేక్షకులు పైరసీ సైట్ల మీద టొరెంట్ల మీద ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఐబొమ్మ. తక్కువ మెమరీతో క్వాలిటీ హెచ్డిలను ప్లాట్ ఫార్మ్ తో సంబంధం అన్నీ ఇవ్వడం దీని ప్రత్యేకత.
నిజానికిది లీగల్ యాప్ కాదు. చట్ట వ్యతిరేకం. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ ఎక్కడ ఎందులో ఏ కంటెంట్ వచ్చినా చాలు ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. పెద్దగా చదువు రాని వాళ్ళు దీన్ని వాడుతున్నారంటే రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఇండస్ట్రీ పెద్దలకు తెలియకుండా పోలేదు. ఓటిటిలు కూడా ఈ బొమ్మ మీద కన్నేసి సమయం కోసం వేచి చూశాయి. ఎట్టకేలకు దీనికి కళ్లెం పడింది. ఇకపై తాము సేవలు అందించలేమంటూ ఈ యాప్ శాశ్వతంగా సెలవు తీసుకోవడం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది.
ఇలాంటివి ఇంకా జరగాలి. పైరసీని రకరకాల మార్గాల్లో వీలైనంత కట్టడి చేసేందుకు అందరూ నడుం బిగించాలి. కాకపోతే పదుల సంఖ్యలో ఉన్న ఓటిటిలు కూడా వీలైనంత అందుబాటు ధరలతో సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం చేస్తే ఇలాంటివి తగ్గుతాయి. ప్రతి శుక్రవారం ఒక్కో సినిమా ఒక్కో వెబ్ సిరీస్ రకరకాల యాప్స్ లో వస్తుంటే వాళ్ళైనా ఎన్నని కొంటారు. ఈ బలహీనత వల్లే బొమ్మలు బొరుసులు లాంటి యాప్స్ ఆన్ లైన్ వేదికగా చెలరేగిపోతున్నాయి. కోట్లాది సబ్స్క్రైబర్స్ ని ఆకట్టుకుని వాళ్ళ డేటాని తమ చిత్తానికి తీసుకుంటున్నాయి. దెబ్బకు కొందరు నెటిజెన్లు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు పోస్టులు పెట్టడం అసలు ట్విస్ట్.
This post was last modified on July 7, 2022 5:07 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…