రేపు విడుదల కాబోతున్న హ్యాపీ బర్త్ డేకి టికెట్ రేట్లు భారీగా తగ్గించామని యూనిట్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేసుకుంటోంది. ముఖ్యంగా నైజామ్ లో సింగల్ స్క్రీన్ ధర కేవలం 110 రూపాయలే అనే క్యాప్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అయితే మల్టీ ప్లెక్సులకు 177 నిర్ణయించడం అంత ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడం లేదు. ఇంకో పాతిక తగ్గించి నూటా యాభైకి లాక్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే అధిక శాతం ఆడియన్స్ కి లొకేషన్ పరంగా అందుబాటులో ఉన్నది ఇవే.
ఇంతా చేసి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా లేవు. ఎక్కడా యాభై శాతం ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఇక్కడైతే ఇలా చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాత రేట్లే ఉండటంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి ఎత్తుగడ కాస్త ఇమేజ్ ఉన్న హీరోల రిలీజుల టైంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప లావణ్య త్రిపాఠి లాంటి హీరొయిన్ ఓరియెంటెడ్ మూవీకి కాదు. ఎంత ట్రెండీ కంటెంట్ ఉన్నా మొదటి రోజే థియేటర్ లో చూసేద్దామనే ఆత్రం ఉండదుగా.
సో హ్యాపీ బర్త్ డే హిట్ అయినా కాకపోయినా ఇది కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదూ మళ్ళీ మొదటికే వెళతాం అంటే ఎవరేం చేయలేరు. దీని పరిస్థితే ఇలా ఉంటే అసలే బజ్ లేని చిన్న సినిమాలు గంధర్వ, మా నాన్న నక్సలైట్, రుద్రసింహ లాంటి వాటి గురించి చెప్పేదేముంది. థియేటర్లను ఎలా ఫుల్ చేయాలనే ఆలోచన చేయకుండా కేవలం మొదటి రెండు మూడు రోజుల్లోనే వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాలనే ధోరణిని వీడకపోతే రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటేనే లాంగ్ రన్ లో ఫలితాలు బాగుంటాయి. లేదంటే అంతే సంగతులు.
This post was last modified on July 7, 2022 4:55 pm
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…