Movie News

రాజమౌళిని మ్యాచ్ చేయడం కష్టం

కొన్నేళ్ల కిందట్నుంచి తెలుగేతర భాషల్లో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఏ భారీ చిత్రం రిలీజైనా.. బాహుబలితో ఆటోమేటిగ్గా పోలిక వచ్చేస్తోంది. ‘బాహుబలి’ చూసి స్ఫూర్తి పొంది.. అలాగే ఆ సినిమాను చూసి తామెందుకు అలాంటి చిత్రం తీయలేం అన్న భావనతో వివిధ ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలు అలాంటి భారీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ అలాంటి మ్యాజిక్ మాత్రం రీక్రియేట్ చేయలేకపోతున్నారు. హిందీలో, తమిళంలో చేసిన ఇలాంటి ప్రయత్నాలేవీ ఫలితాన్నివ్వలేదు.

ఇటీవలే హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ఎంత దారుణమైన అనుభవాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఇక అందరి దృష్టీ కోలీవుడ్ మీదికి మళ్లుతోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలల సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ను తమిళ బాహుబలిగా అందరూ అభివర్ణిస్తున్నారు. దీని బడ్జెట్, తారాగణం, టెక్నికల్ సపోర్ట్.. ఇలా ఏ రకంగా చూసుకున్నా ‘బాహుబలి’కి దీటైన సినిమాలాగే కనిపిస్తోంది.

ఐతే ‘పొన్నియన్ సెల్వన్’ తమిళ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుండొచ్చు కానీ.. ఇతర భాషల్లో అయితే ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. అప్పుడప్పుడూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇదే ప్రమోషన్ అనుకుంటోంది చిత్ర బృందం. కానీ వాటితో ఇతర భాషల్లో ప్రేక్షకులు ఎగబడిపోరు. వారిలో ఆసక్తి రేకెత్తించేలా ఇంకేదో చేయాలి. ఇక్కడే రాజమౌళికి, మిగతా దర్శకులకు ఉన్న తేడా ఏంటో అర్థమవుతుంది. సినిమా గొప్పగా తీయడమే కాదు.. దాన్ని మార్కెట్ చేయడంలోనూ రాజమౌళిని మ్యాచ్ చేసేవాళ్లు ఎవరూ లేరిప్పుడు. తన సినిమాల మార్కెటింగ్, ప్రమోషన్ అంతా కూడా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటాడు. అదిరిపోయే లెవెల్లో పోస్టర్లు, వీడియో ప్రోమోలు రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీ తీసుకొస్తాడు.

‘బాహుబలి’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అదే జరిగింది. కానీ దర్శకుడిగా మణిరత్నంది ఎంత గొప్ప స్థాయి అయినా.. ఆయన ప్రమోషన్ల విషయంలో వీకే. అలాగే మాస్‌ను, సగటు ప్రేక్షకులను ఎగ్జైట్ చేసేలా ప్రోమోలు కట్ చేయడంలోనూ ఆయన బలహీనత గురించి అందరికీ తెలిసిందే. కాబట్టే ‘పొన్నియన్ సెల్వన్’ విషయంలో ఇప్పటిదాకా అయితే ఇతర భాషల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయాడు. మరి రాబోయే రోజుల్లో అయినా మ్యాజిక్ జరుగుతుందేమో చూద్దాం.

This post was last modified on July 7, 2022 4:46 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

28 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

36 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

51 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

52 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago