నందమూరి కళ్యాణ్ కెరీర్ ఆద్యంతం ఒడుదొడుకుల ప్రయాణమే. ‘అతనొక్కడే’కు ముందు, తర్వాత అతను చేసిన సినిమాలన్నీ ఫెయిల్యూర్లే. మళ్లీ ‘పటాస్’తో కానీ అతను కోరుకున్న విజయం దక్కలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ పరాజయాల బాట పట్టాడు. చివరగా అతను ‘118’తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఈసారి అతను బాగా గ్యాప్ తీసుకుని ‘బింబిసార’ సినిమా చేశాడు. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని నమ్మి సొంత బేనర్లో భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశాడు కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్ మార్కెట్ ప్రకారం చూస్తే.. టైమ్ ట్రావెల్ కథాంశంతో, చారిత్రక నేపథ్యంలో సినిమా తీయడం రిస్కే. పైగా ఈ సినిమా ముందు నుంచి అసలు వార్తల్లోనే లేదు. రిలీజ్ దగ్గర పడుతుండగా కూడా ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకోలేదు. అలాంటపుడు రిలీజ్ ముంగిట దీనికి హైప్ ఎలా వస్తుంది అని అంతా సందేహించారు. కానీ ట్రైలర్‌తో కథ మారిపోయింది.
ఇటీవలే ‘బింబిసార’ ట్రైలర్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అందులో కథాంశం, భారీతనం, విజువల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా తీయడం, కళ్యాణ్ రామ్ రాజీ పడకుండా అంత ఖర్చు పెట్టడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ట్రైలర్‌కు యూనివర్శల్ అప్లాజ్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్, లైక్స్ ఆశ్చర్యం కలిగించేవే. రెండు రోజుల వ్యవధిలో 15 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది ‘బింబిసార’ ట్రైలర్. లైక్స్ కూడా 5 లక్షలకు దగ్గరగా ఉన్నాయి.
ట్రైలర్ రిలీజైన మూడో రోజు కూడా యూట్యూబ్‌లో టాప్-2లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇంటర్నెట్ విప్లవం కారణంగా చిన్న సినిమాల టీజర్లకు, ట్రైలర్లకు కూడా భారీగానే వ్యూస్ వస్తున్నాయి కానీ.. ఈ సినిమా స్థాయికి ఇంత వేగంగా ఇన్ని వ్యూస్ రావడం గొప్ప విషయమే. మామూలుగా పెద్ద హీరోలు నటించే భారీ చిత్రాలకే ఇలాంటి ఊపు కనిపిస్తుంది. దీన్ని బట్టి ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందన్నది స్పష్టం. ట్రైలర్‌కు తగ్గట్లు సినిమా కూడా ఉంటే కళ్యాణ్ రామ్‌కు మళ్లీ మంచి హిట్ ఒకటి పడడం గ్యారెంటీ.
This post was last modified on July 7, 2022 4:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…